Viral Video : రెస్టారెంట్‌ను ధ్వంసం చేసిన ముగ్గురు మహిళలు.. ఎందుకంటే..?

రెస్టారెంట్లకు వెళ్లేవారిలో కొంత మంది కస్టమర్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. తాము అడిగింది ఇవ్వకుంటే హోటల్ యాజమాన్యంపై దాడికి దిగుతుంటారు.

Viral Video : రెస్టారెంట్లకు వెళ్లేవారిలో కొంత మంది కస్టమర్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. తాము అడిగింది ఇవ్వకుంటే హోటల్ యాజమాన్యంపై దాడికి దిగుతుంటారు. లేదంటే.. రెస్టారెంట్లలోని వస్తువులను ధ్వంసం చేస్తుంటారు. అలాంటి ఘటనే ఒకటి న్యూయార్క్‌లో జరిగింది. రెస్టారెంట్లోకి వచ్చిన ముగ్గురు మహిళలు తాము అడిగినంత సాస్ ఇవ్వలేదనే కోపంతో రెస్టారెంట్ ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగలేదు..

అక్కడి సిబ్బందిపై కూడా దాడికి తెగబడ్డారు. న్యూయార్క్‌లోని ముగ్గురు మహిళలు రెస్టారెంట్లోకి వెళ్లి ధ్వంసం చేశారు. ముందు ఆ ముగ్గురు రెస్టారెంట్‌లో ఫుడ్‌ని ఆర్డర్‌ చేసి తిన్నారు కూడా. అయితే ఫ్రై ఐటెం తినేందుకు కొంత సాస్‌ కావాలని అడిగారు. సదరు రెస్టారెంట్‌ సిబ్బంది అందుకు అంగీకరించలేదు. ఆగ్రహం చెందిన ఆ ముగ్గురు రెస్టారెంట్‌లోని వస్తువులను నాశనం చేయడమే కాకుండా కౌంటర్‌లోకి వెళ్లి సిబ్బందిపై కూడా దాడికి దిగారు.

ఇప్పటికే రెస్టారెంట్లో వారికి ఇచ్చిన సాస్‌ ధర 1.75 డాలర్లు పలుకుతుందని సిబ్బంది చెబుతున్నారు. అందుకే అదనంగా సాస్ ఇవ్వడం కుదరదని అక్కడి రెస్టారెంట్‌ ఉద్యోగి తెలిపాడు. ఆర్డర్‌ చేసిన ఫుడ్‌‌కు మాత్రమే సాస్‌ వడ్డించడం జరుగుతుందని చెప్పుకొచ్చాడు. న్యూయార్క్‌ పోలీసులు ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీనిక సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read Also : Viral Video: పిల్లలకు కోపమొచ్చింది.. బీహార్‌లో పాఠశాల భవనాన్ని ధ్వంసం చేసిన విద్యార్థులు

ట్రెండింగ్ వార్తలు