Viral Video: పిల్లలకు కోపమొచ్చింది.. బీహార్‌లో పాఠశాల భవనాన్ని ధ్వంసం చేసిన విద్యార్థులు

పాఠశాల ఉపాధ్యాయుల తీరుతో విసిగిపోయిన స్కూల్ స్టూడెంట్స్ రెచ్చిపోయారు. వారిలో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. దీంతో పాఠశాల ప్రహరీ గోడను ధ్వంసం చేయడంతో పాటు పాఠశాల ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటన బాహార్ లోని కతివార్ జిల్లాలో చోటు చేసుకుంది.

Viral Video: పిల్లలకు కోపమొచ్చింది.. బీహార్‌లో పాఠశాల భవనాన్ని ధ్వంసం చేసిన విద్యార్థులు

Students

Viral Video: పాఠశాల ఉపాధ్యాయుల తీరుతో విసిగిపోయిన స్కూల్ స్టూడెంట్స్ రెచ్చిపోయారు. వారిలో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. దీంతో పాఠశాల ప్రహరీ గోడను ధ్వంసం చేయడంతో పాటు పాఠశాల ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటన బీహార్ లోని కతివార్ జిల్లా బార్సోయి బ్లాక్ లోని అబాద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరియాల్ అప్ గ్రేడ్ మిడిల్ స్కూల్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే స్థానిక గ్రామస్థులు కావాలనే విద్యార్థులను రెచ్చగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందించి విచారణకు ఆదేశించింది.

Sri Lanka: శ్రీలంకకు అండగా ఉంటాం: భారత్

విద్యార్థులు ఈ స్థాయిలో ఆగ్రహానికి గురికావడం వెనుక పలు కారణాలు చెబుతున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. అంతేకాక తమ టీచర్లు తమకు పాఠాలు చెప్పకుండా మసాజ్ చేయమని బలవంతం చేశారని ఆరోపించారు. ఈ కారణంగా విద్యార్థులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలను చూస్తే విద్యార్థులు రేకులతో ఏర్పాటు చేసిన పాఠశాల సరిహద్దును ధ్వంసం చేయడం కనిపిస్తోంది. అంతటితో ఆగని విద్యార్థులు పాఠశాల ఆవరణలోకి వెళ్లి స్కూల్ కు సంబంధించిన పలు ఆస్తులను ధ్వంసం చేశారు.

ఈ సంఘటన సమాచారం అందుకున్న జిల్లా పరిషత్ సభ్యుడు మహ్మద్ గుల్జార్ ఆలం విద్యార్థినితో మాట్లాడేందుకు ఘటన స్థలానికి వచ్చారు. విద్యార్థులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను గుల్జార్ ఆలంకు వివరించారు. ఈ ఘటన సిగ్గుచేటని ఎడ్యుకేషన్ ఆఫీసర్ ముంతాజ్ అహ్మద్ అన్నారు. ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపైన్ చంద్రతో మాట్లాడిన ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.