లండన్‌లోని ఓ భవనంలోకి చొరబడిన ఓ దొంగ ఏకంగా రూ.107 కోట్లకుపైగా విలువజేసే బంగారు ఆభరణాలను, డిజైనర్ హ్యాండ్‌బ్యాగ్‌లను దోచుకెళ్లాడు. ముసుగు వేసుకుని, వీపుపై బ్యాగు తగిలించుకుని భవనంలోకి వచ్చిన ఆ దొంగ ఆభరణాలను పెట్టెల్లో నుంచి తీశాడు.
వాటిని తన బ్యాక్‌ప్యాక్‌లో వేసుకున్నాడు. ఈ భారీ చోరీ జరిగిన సమయంలో ఇంటి లోపలే ఓ వ్యక్తి ఉన్నాడు. తమ భవనంలోని చొరబడిన దొంగ పిల్లిలా మెల్లిగా అక్కడ తిరిగాడని చెప్పాడు. సెయింట్ జాన్స్ వుడ్ హౌస్‌లో ఆ దొంగ చోరీ చేసిన ఆ వస్తువులు హాంకాంగ్‌లోని షఫీరా హువాంగ్‌కు చెందినవని అధికారులు తెలిపారు. ఆ దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.16 కోట్ల రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఆ దొంగ మొదట రెండో అంతస్తులోని ఓ కిటికీ ద్వారా భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అనంతరం రూఫ్‌పైకి ఎక్కి బాత్రూమ్ కిటికీ ద్వారా భవనంలోకి ప్రవేశించాడు. అతడు ఆభరణాలు కాజేసిన గదిలోని డెస్కుపై రూ.32,239 నగదు కూడా ఉంది. అయితే, ఆ దొంగ ఆ డబ్బుని తీసుకోలేదు.
TG TET Exam 2025: తెలంగాణలో ప్రారంభమైన టెట్.. 17 జిల్లాల్లో 92 కేంద్రాల్లో పరీక్షలు