TG TET Exam 2025: తెలంగాణలో ప్రారంభమైన టెట్.. 17 జిల్లాల్లో 92 కేంద్రాల్లో పరీక్షలు
మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

తెలంగాణలో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి టెట్ పరీక్షలు షురూ అయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. టెట్‌లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.
మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. మొదటి సెషన్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు జరుగుతాయి.
ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్ జరుగుతోంది. టీచర్లుగా ఎంపిక కావాలంటే టెట్‌లో అర్హత సాధిచండం తప్పనిసరి. అనంతరం డీఎస్సీ రాయాల్సి ఉంటుంది. ఇందులో మంచి మార్కులు వస్తే.. టెట్ మార్కులు ఎక్కువగా వచ్చిన వారికి మంచి స్కోరింగ్ వస్తుంది.
టెట్‌లో అర్హత సాధించలేనివారు డీఎస్సీ రాసే వీలు ఉండదు. టీఆర్టీ రాయడానికీ అర్హత ఉండదు. తెలంగాణ సర్కారు ఇప్పటికే డీఎస్సీ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. అర్హత సాధించిన వారికి పోస్టింగులు కూడా వచ్చాయి. ప్రస్తుతం రెండోసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సర్కారు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో టెట్ -2ను నిర్వహిస్తోంది.
CM Revanth Reddy: మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం