CM Revanth Reddy: మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం

మాట నిలబెట్టుకుందామని, కష్టపడి పనిచేద్దామని రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం

Updated On : January 2, 2025 / 10:28 AM IST

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. వారితో హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశమైన రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్పు కోసమే తమకు ప్రజలు అధికారం ఇచ్చారని తెలిపారు.

మాట నిలబెట్టుకుందామని, కష్టపడి పనిచేద్దామని రేవంత్ రెడ్డి అన్నారు. మరింత పట్టుదలగా పనిచయాలని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలు గుర్తించారని, ప్రభుత్వ ఇబ్బందులను అర్థం చేసుకుంటున్నారని తెలిపారు.

సమస్యలను అధిగమించేందుకు బీఆర్ఎస్ దుష్పచారాన్ని తిప్పికొట్టాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మరింత చిత్తశుద్ధితో పనిచేద్దామన్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరు పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని అన్నారు.

Telangana Liquor Sales : తెలంగాణలో మద్యం అమ్మకాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఎఫెక్ట్.. ఎలాగంటే..