Telangana Liquor Sales : తెలంగాణలో మద్యం అమ్మకాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఎఫెక్ట్.. ఎలాగంటే..

గతేడాదితో పోలిస్తే తెలంగాణలో ఈసారి మద్యం అమ్మకాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది.

Telangana Liquor Sales : తెలంగాణలో మద్యం అమ్మకాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఎఫెక్ట్.. ఎలాగంటే..

Updated On : January 1, 2025 / 11:07 PM IST

Telangana Liquor Sales : తెలంగాణలో మద్యం అమ్మకాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఎఫెక్ట్ కనిపించింది. ఈసారి తెలంగాణలో న్యూ ఇయర్ లిక్కర్ సేల్స్ పై ఈ ప్రభావం బాగా పడింది. ఏపీలో కూటమి సర్కార్ కొత్త లిక్కర్ పాలసీని తేవడంతో ఆ ప్రభావం తెలంగాణలో మద్యం అమ్మకాలపై చూపింది. వైసీపీ హయాంలో ఏపీ బోర్డర్ జిల్లాల్లో భారీగా లిక్కర్ సేల్స్ ఉండేవి. ఇప్పుడా సీన్ రివర్స్ అయ్యింది.

గతేడాదితో పోలిస్తే తెలంగాణలో ఈసారి మద్యం అమ్మకాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. వైసీపీ హయాంలో ఏపీ, తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో జోరుగా లిక్కర్ సేల్స్ జరిగేవి. కూటమి సర్కార్ వచ్చాక ఏపీలో మద్యం ప్రియులకు అన్ని బ్రాండ్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో మొన్నటి వరకు సరిహద్దు ప్రాంతాల్లో జాతరను తలపించే వైన్ షాపుల గిరాకీ.. ఇప్పుడు బాగా పడిపోయింది.

Liquor

Liquor

ఏపీలో కొత్త మద్యం పాలసీతో 11 లిక్కర్ కంపెనీలు మద్యం ధరలను తగ్గించాయి. గతంలో రేట్లు ఎక్కువ బ్రాండ్లు తక్కువ అన్న కారణంతో తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న వైన్ షాపులకు ఏపీ సరిహద్దుల్లో మద్యం ప్రియులు క్యూ కట్టేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఏపీలో చాలా రకాల బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో పోల్చితే ఏపీలో లిక్కర్ ధరల్లో పెద్దగా తేడా లేదు. దీంతో కొందరు తెలంగాణ సరిహద్దు జిల్లాల వాళ్లు కూడా ఏపీలో మద్యం కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.

Also Read : రేషన్ బియ్యం ఉచ్చు పేర్నినానికే పరిమితం కాలేదా?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బ్రాందీ క్వార్టర్ 130 రూపాయలుగా ఉంది. ఇదే బ్రాండ్ ఏపీలో 120 రూపాయలకు అమ్ముతున్నారు. చీప్ లిక్కర్ ఏపీలో 99 రూపాయలకు అందుబాటులోకి తెచ్చారు. దీంతో పోయిన ఏడాది వరకు జాతరను తలపించేలా ఉన్న ఏపీ, తెలంగాణ వైన్ షాపుల దగ్గర విక్రయాలు తగ్గిపోయాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతేడాది డిసెంబర్ నెలలో 264 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది డిసెంబర్ లో 228 కోట్ల రూపాయల మద్యం సేల్స్ జరిగాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు కలిపి దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు అమ్మకాలు తగ్గినట్లు సమాచారం.

liquor

liquor

ఇక తెలంగాణ వ్యాప్తంగా 2023 డిసెంబర్ నెలలో 4వేల 292 కోట్ల రూపాయల మేర మద్యం అమ్మకాలు జరగ్గా, ఈ డిసెంబర్ లో 3వేల 662 కోట్ల రూపాయల సేల్స్ జరిగాయి. అంటే, 2023 డిసెంబర్ తో పోలిస్తే 2024 డిసెంబర్ లో సుమారు 600 కోట్ల లిక్కర్ సేల్స్ తగ్గాయి.

మొత్తం మీద ఏపీలో కూటమి సర్కార్ కొత్త మద్యం పాలసీ ఎఫెక్ట్ తెలంగాణలో మద్యం అమ్మకాలపై పరోక్షంగా పడిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంటున్నాయి.

 

Also Read : తెలంగాణ బీజేపీలో ఈటల మౌనం వెనుక మతలబేంటి?