Most Viewed Photo
Most Viewed Photo : ఫోటోలు తీయడం.. దిగడం అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. కొన్ని ఫోటోలు మనకి నచ్చి మన కంప్యూటర్ మీద.. మొబైల్ ఫోన్ల మీద వాల్ పేపర్లుగా (wallpapers) కూడా పెట్టేసుకుంటాం. అలా మీకు ఎంతో పరిచయం ఉన్న ఓ ఫోటో గురించి చెప్పాలి. ఈ ఫోటో ఖచ్చితంగా మీ కంప్యూటర్ వాల్ మీద వాడే ఉంటారు.
Groceries on Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కిరాణా సామాన్లు తీసుకెళ్తున్న వ్యక్తి వీడియో వైరల్
Windows XP వాడిన వాళ్లకు ఈ ఫోటో గురించి పరిచయం చేయనక్కర్లేదు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డిఫాల్ట్ వాల్ పేపరే “బ్లిస్” (bliss). దీన్ని చూడగానే ఎంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. పచ్చని పచ్చికబయలు, నీలిరంగు ఆకాశంలో తెల్లగా పరిచిన మేఘాలు చూడగానే ముచ్చట గొలిపే ఫోటో ఇది. 2000 లో ఈ వాల్‌పేపర్ ని అందరూ వాడే ఉంటారు. అయితే ఈ ఫోటోకి ఒక చరిత్ర ఉంది.
Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ
ఈ ఫోటో ప్రపంచంలోనే అత్యధికులు వీక్షించిన ఫోటోగా గుర్తింపు దక్కించుకుంది. అయితే ఈ ఫోటో ఎవరు తీశారు? అనేది చాలామందికి తెలియదు. 1996లో చార్లెస్ ఓ రియర్ (Charles O’Rear) అనే వ్యక్తి ఈ ఫోటోని తీశారు. అప్పట్లో అంటే 2000 సంవత్సరంలో మైక్రో సాఫ్ట్ (Microsoft) ఈ ఫోటో హక్కుల్ని కొనేసింది. ఈ ఫోటోని వరకు బిలియన్ల సంఖ్యలో జనం చూసారని ఇప్పుడు అంచనా వేశారు. గతంలో చార్లెస్ మారిన్ కౌంటీకి (Marin County) వెళ్లినప్పుడు ఈ ఫోటోని తీశాడు. 20 సంవత్సరాల తర్వాత తన భార్య డాఫ్నే లార్కిన్‌తో (Daphne Larkin) కలిసి మరల అదే ప్రదేశానికి వెళ్లినప్పుడు అప్పటి ఫోటో ఫ్రేమ్ ను వెంట తీసుకెళ్లాడు చార్లెస్. అలా ఈ ఫోటో, చార్లెస్ మరలా వార్తల్లోకి వచ్చారన్నమాట.