China New Dam Near India Border: భారత సరిహద్దుకు సమీపంలో ఆనకట్టను నిర్మిస్తోన్న చైనా.. తాజా ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి

భారత్, నేపాల్ సరిహద్దుల సమీపంలో గంగానది ఉపనదిపై టిబెట్‌ ప్రాంతంలో చైనా కొత్త ఆనకట్టను నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. దీన్నిబట్టి.. ఎల్ఐసీ (వాస్తవ నియంత్రణ రేఖ)లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సైనిక, మౌలిక సదుపాయాలు, గ్రామాల నిర్మాణంలో చైనా వేగంగా ముందుకెళ్లేందుకు దృష్టిసారించినట్లు తెలుస్తోంది.

China Building In India border

China New Dam Near India Border: సరిహద్దుల్లో చైనా మరోసారి తన దందుడుకు చర్యను అవలంభిస్తున్నట్లు కనిపిస్తోంది. భారత్, నేపాల్ సరిహద్దుల సమీపంలో గంగానది ఉపనదిపై టిబెట్‌ ప్రాంతంలో చైనా కొత్త ఆనకట్టను నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. దీన్నిబట్టి.. ఎల్ఐసీ (వాస్తవ నియంత్రణ రేఖ)లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సైనిక, మౌలిక సదుపాయాలు, గ్రామాల నిర్మాణంలో చైనా వేగంగా ముందుకెళ్లడం ప్రారంభించినట్లు కనిపిస్తోంది. భారత్, నేపాల్‌తో చైనా సరిహద్దు  ట్రైజంక్షన్‌కు ఉత్తరాన కొన్ని కిలో మీటర్ల దూరంలో ఈ ఆనకట్టు ఉందని, ఆనకట్ట 350 నుంచి 400 మీటర్ల పొడవు ఉన్నట్లు ఇంటెల్ ల్యాబ్‌లోని జియోస్పేషియన్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను ఆయన విడుదల చేశాడు.

China India Border: చైనా బరితెగింపు: ఎల్ఏసీ వెంట మొబైల్ టవర్ల ఏర్పాటు

ఇదిలాఉంటే ఈ ఆనకట్ట సమీపంలో విమానాశ్రయాన్నికూడా నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. భారతదేశం, నేపాల్ తో ట్రైజంక్షన్ సరిహద్దుకు ఉత్తరాన కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న మాబ్జా జాంగ్బో నదిపై చైనా ఆనకట్ట నిర్మాణం జరుపుతుంది. అయితే దీని నిర్మాణాన్ని 2021 నుంచి ప్రారంభించింది. ప్రస్తుతం అది నిర్మాణం పూర్తికానప్పటికీ.. మబ్జా జాంగ్‌బో నదినీటిని మళ్లించడానికి, నిల్వ చేయడానికి ఉపయోగించవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నూతన ఆనకట్ట ద్వారా భవిష్యత్తులో చైనా నీటిపై నియంత్రణకు ప్రయత్నాలు చేస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోందని డామియన్ సైమన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

China India border Issue: సరిహద్దు వెంట సాయుధ రోబోలను మోహరించిన చైనా

ఇటీవలి కాలంలో చైనా యార్లంగ్ జాంగ్బో నదిపై అనేక చిన్న ఆనకట్టలను నిర్మించింది. ఈశాన్య ప్రాంతంలో బ్రహ్మపుత్రకు సంబంధించిన ఇలాంటి ఆందోళనలను రేకెత్తించిన విషయం విధితమే. 2020లో ఎల్ఏసీ‌లోని లడఖ్ సెక్టార్‌లో భారత్, చైనా దళాల మధ్య సైనిక దళాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం విధితమే. అప్పటి నుంచి అనేక ఉపగ్ర చిత్రాలు, నివేదికల ద్వారా.. సరిహద్దుల్లో చైనా విమానాశ్రయాల నిర్మాణం, క్షిపణి, వాయు రక్షణ సౌకర్యాలు, ఆయుధ సామాగ్రి డంప్‌లతో సహా సైనిక, పలురకాల మౌలిక సదుపాయాల కల్పనను చర్యలు చేపడుతున్నట్లు స్పష్టమవుతోంది. తద్వారా సరిహద్దుల్లో ఈ చర్యతో చైనాతన ప్రాబల్యాన్ని పెంచుకొనే లక్ష్యంతో ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే 2020లో చైనా, ఇండియా సరిహద్దులో ఘర్షణ తరువాత ఇప్పటికే 17సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశాలు జరిగాయి. డిసెంబర్ 20న చైనావైపున ఉన్న ఛుఘల్ మెల్డో సరిహద్దు సమావేశ ప్రదేశంలో నిర్వహించిన సమావేశంలో.. పశ్చిమ సెక్టార్ లో భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.