దక్షిణ చైనా సముద్రంపై యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. డ్రాగన్ దేశం ప్రతికారంగా రెండు బాలిస్టిక్ మిసైళ్లను పేల్చింది. ఇందులో ఒకటి భారత్ కు సమీపంగా..భూటాన్ సరిహద్దుల నుంచి ప్రయోగించడం కలవరానికి గురి చేసింది. అమెరికా నిఘా విమానం యూ 2 చక్కర్లు కొట్టడం, ప్రతికారంగా రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను చైనా పేల్చింది.
చైనాకు ఉత్తరంగా ఉన్న బొహాయి సముద్ర తీరంలో నౌక, సైనిక దళాలు యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. ఈ క్రమంలో…అమెరికాకు చెందిన నిఘా విమానం యూ – 2 దూసుకొచ్చిందని, నో ఫ్లై జోన్ లోకి విమానాలను పంపడం నిబంధనలను ఉల్లఘించమేనన చైనా ఆరోపిస్తోంది.
https://10tv.in/bella-thorne-breaks-onlyfans-record-earning-over-1-million-in-first-24-hours/
దీనిని అమెరికా తోసిపుచ్చుతోంది. శక్తివంతమైన డిఎఫ్ శ్రేణి చైనా పేల్చడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇంకోసారి నో ఫ్లై జోన్ లోకి ప్రవేశిస్తే..విమానాలను కూడా పేల్చేస్తామని డ్రాగెన్ వార్నింగ్ ఇచ్చినట్లవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
రెండు బాలిస్టిక్ మిస్సైళ్లలో ఒకటి జింగాయ్ ప్రావిన్స్ నుంచి ప్రయోగించగా, రెండో దానిని ఫ్రావిన్స్ నుంచి ప్రయోగించనట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు వెల్లడించింది. రెండు క్షిపణులకూ క్షిపణులకూ అణ్వాయుధాలను మోసుకెళ్లే సత్తా ఉందని, 4500 కిలోమీటర్లు ప్రయాణించ గల వీటికి.. సముద్రంలో, గగనతలంలో కదులుతున్న టార్గెట్లను సైతం పేల్చేయగల సత్తా ఉందని చైనీస్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.