China : చైనా తెచ్చిన కొత్త చట్టం .. అబ్బాయిలతో అమ్మాయిల లోదుస్తుల యాడ్స్..

చైనా తెచ్చిన కొత్త చట్టం .. అబ్బాయిలతో లోదుస్తుల యాడ్స్ చేయించాయి ఆయా సంస్థలు.

China Bans Female Lingerie Models.. Men Doing

China : వాణిజ్య ప్రకటనల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ కనిపిస్తుంటారు. ఆ ప్రకటనలు షేవింగ్ కు సంబంధించిన యాడ్స్ లో అయినా అమ్మాయిలే ప్రధాన ఆకర్షణగా ఉంటారు. మగవారికి సంబంధించిన డియోడ్రెంట్ యాడ్స్ లో కూడా అమ్మాయిలే స్పెషల్ ఎట్రాక్షన్. మగవారికి సంబంధించిన ప్రొడక్ట్స్ లోనే కనిపించి ఆయా కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలకు ప్లస్ గా మారే అమ్మాయిలు (మోడల్స్) వారికి సంబంధించిన ప్రొడక్ట్స్ లో కనిపించటం సర్వసాధారణ విషయం. ఉదాహకరణకు లిప్ స్టిక్..ఫేస్ వాష్,ఫేస్ క్రీమ్, లోదుస్తులు వంటివి. కానీ లేడీస్ లోదుస్తుల యాడ్స్ లో అబ్బాయిలు చేస్తే ఎలా ఉంటుంది? చూడటానికి వేరేగా ఉంటుంది కదూ..కానీ చైనాలో మాత్రం అదే జరుగుతోంది. అమ్మాయిల లోదుస్తులకు సంబంధించిన యాడ్స్ ను అబ్బాయిలతో చేయించారు. ఇది తప్పని పరిస్థితుల్లో చేయించినా చూడటానికి అదోలా ఉందనేలా ఉందీ ప్రకటన..

దీనికి కారణం చైనా తీసుకొచ్చిన కొత్త చట్టం కారణంగా మారింది. చైనా తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం లోదుస్తుల ప్రకటనల్లో అమ్మాయిలు కనిపించడం వల్ల అశ్లీలత పెచ్చుమీరుతోందని చైనా ప్రభుత్వం భావించింది. దీంతో ఆయా ప్రకటనల్లో అమ్మాయిలు కనిపించకుండా నిషేధం విధించింది. అంతేకాదు..ఆన్‌లైన్ ప్రచారాలకు మహిళలను ఉపయోగించకుండా ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. దీంతో అమ్మాయలు ధరించే లోదుస్తుల ప్రకటనలను వేరే దారి లేక ఆయా కంపెనీల వారు అబ్బాయిలతో ప్రకటన చేయించారు. చైనా తీసుకొచ్చిన ఈ కొత్త చట్టంతో ఇబ్బంది పడిన ఆన్‌లైన్ వ్యాపార సంస్థలు తాజాగా సరికొత్త ఐడియాతో ముందుకొచ్చేశాయి. అమ్మాయిల లోదుస్తుల ప్రచారం ఎలా చేయాలో తెలియక దిగాలు పడి ఆనకగా ఈ సరికొత్త ఐడియాతో అబ్బాయిలతో యాడ్స్ చేయించాయి.

అమ్మాయిల స్థానంలో అబ్బాయిలతో లోదుస్తులకు సంబంధించిన యాడ్స్ చేయించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ వీడియోలపై భలే భలే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. షేక్‌స్పియర్ కాలంలోనూ ఇలాగే ఉండేదని, అప్పట్లో వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు మహిళలకు అనుమతి లేదని కొందరంటే.. అప్పట్లో స్త్రీ పాత్రలను పురుషులు ధరించేవారని మరో యూజర్ రాసుకొచ్చాడు. ఇంకొరు అమ్మాయిల కంటే అబ్బాయిలే బాగున్నారంటూ..ఇలా విభిన్న రీతుల్లో కామెంట్స్ వచ్చాయి ఈ యాడ్స్ పై..