China On Israel Gaza Attack: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా ప్రకటన అనంతరం చైనా భారీ హెచ్చరిక

ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధ నేరాలను ఆపాలని, లేకపోతే పరిస్థితి అదుపు తప్పుతుందని చైనా భాగస్వామ్య దేశం ఇరాన్ పేర్కొంది. అయితే ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చైనాను అమెరికా కోరడం గమనార్హం

Israel Palestine Conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా ప్రకటన వెలువడిన కాసేపటికే చైనా భారీ హెచ్చరిక చేసింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పందిస్తూ గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్‌తో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రస్తుతం ఆత్మ రక్షణ పరిధిని దాటి పోయాయని అన్నారు.

గాజా ప్రజలకు సామూహిక శిక్షలు విధించడాన్ని ఇజ్రాయిల్ ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని వాంగ్ యి అన్నారు. ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధ నేరాలను ఆపాలని, లేకపోతే పరిస్థితి అదుపు తప్పుతుందని చైనా భాగస్వామ్య దేశం ఇరాన్ పేర్కొంది. అయితే ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని చైనాను అమెరికా కోరడం గమనార్హం. ఇజ్రాయెల్‌లో శాంతిని నెలకొల్పడంలో మధ్యవర్తి పాత్ర పోషించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అభ్యర్థించారు. చైనా, ఇరాన్ భాగస్వామ్య దేశాలు కాబట్టి శాంతిని కాపాడేందుకు చైనా తన ప్రభావాన్ని ఉపయోగించాలని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు.

ఇది కూడా చదవండి: Afghanistan Earthquake : అఫ్గానిస్థాన్ లో మరోసారి భూకంపం.. భయంతో వణికిపోయిన స్థానికులు

చైనీస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రచురించిన రీడౌట్ ప్రకారం.. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి తన వంతుగా, వీలైనంత త్వరగా రాజకీయ పరిష్కారాన్ని కోరుకోవడంలో అమెరికా నిర్మాణాత్మక, బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలని అన్నారు. వాంగ్ యీ మాట్లాడుతూ “అంతర్జాతీయంగా సున్నితమైన అంశాలతో వ్యవహరించేటప్పుడు, ప్రధాన దేశాలు నిష్పాక్షికతను పరిగణనలోకి తీసుకోవాలి. దేశాలు శాంతి, సంయమనాన్ని కాపాడుకోవాలి. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండటంలో ప్రముఖ పాత్ర వహించాలి. సమగ్ర ఏకాభిప్రాయాన్ని ప్రోత్సహించేందుకు వీలైనంత త్వరగా అంతర్జాతీయ శాంతి సమావేశాన్ని నిర్వహించాలని బీజింగ్ పిలుపునిచ్చింది’’ అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తెలిపారు.