ఇటలీ విరాళంగా ఇచ్చిన PPEలను తిరిగి ఆ దేశానికే విక్రయించిన చైనా

చైనాలో కరోనావైరస్ వ్యాప్తి విజృంభించినప్పుడు ఇటలీ చైనాకు వ్యక్తిగత రక్షణ సామగ్రిని (పిపిఈ) విరాళంగా ఇచ్చింది. ది స్పెక్టేటర్ మ్యాగజైన్‌లో వచ్చిన నివేదిక ప్రకారం, విరాళంగా ఇచ్చిన అదే  పిపిఇలను చైనా.. ఇటలీకి విక్రయించింది.

  • Publish Date - April 6, 2020 / 09:04 PM IST

చైనాలో కరోనావైరస్ వ్యాప్తి విజృంభించినప్పుడు ఇటలీ చైనాకు వ్యక్తిగత రక్షణ సామగ్రిని (పిపిఈ) విరాళంగా ఇచ్చింది. ది స్పెక్టేటర్ మ్యాగజైన్‌లో వచ్చిన నివేదిక ప్రకారం, విరాళంగా ఇచ్చిన అదే  పిపిఇలను చైనా.. ఇటలీకి విక్రయించింది.

చైనాలో కరోనావైరస్ వ్యాప్తి విజృంభించినప్పుడు ఇటలీ చైనాకు వ్యక్తిగత రక్షణ సామగ్రిని (పిపిఈ) విరాళంగా ఇచ్చింది. ది స్పెక్టేటర్ మ్యాగజైన్‌లో వచ్చిన నివేదిక ప్రకారం, విరాళంగా ఇచ్చిన అదే  పిపిఇలను చైనా.. ఇటలీకి విక్రయించింది. వైరస్ తగ్గుముఖం పట్టాక ఇటలీకి పిపిఈ కిట్లను దానం చేసినట్లు చైనా ప్రపంచానికి చూపించింది. కానీ, మీడియా నివేదికల ప్రకారం వాస్తవానికి బీజింగ్.. పిపిఈ కిట్లను ఇటలీకి విరాళం ఇవ్వలేదు, విక్రయించింది.

కరోనావైరస్ వ్యాప్తి ప్రారంభ సమయంలో చైనాకు ఇచ్చిన పిపిఈ సరఫరాను తిరిగి కొనుగోలు చేయమని ఇటలీని చైనా బలవంతం చేసిందని ట్రంప్ సీనియర్ పరిపాలన అధికారి ది స్పెక్టేటర్ నివేదికలో ఉదహరించాడు. వైరస్ ఐరోపాలోని ఇటలీకి వ్యాపించక ముందు తన స్వంత జనాభాను రక్షించుకోవడానికి టన్నుల పిపిఈలను ఆ దేశం చైనాకు పంపిందని పరిపాలన అధికారి వివరించారు.

చైనా అప్పుడు ఇటాలియన్ పిపిఈలను తిరిగి ఇటలీకి పంపింది. అయితే వాటిలో కొన్ని పీపీఈలకు డబ్బులు వసూలు చేశాయని ఆయన చెప్పారు. వైరస్ నియంత్రణకు అవసరమైన నిత్యావసరాలు, పరీక్షా వస్తు సామగ్రిని చైనా పెద్ద ఎత్తున విక్రయించింది. వాటిలో చాలా లోపభూయిష్టంగా ఉండటంతో స్పెయిన్ 50,000 క్విక్-టెస్టింగ్ వస్తు సామగ్రిని చైనాకు తిరిగి ఇచ్చింది.

ఇతర దేశాలు మాన్యువల్ సరిగా చదవలేదని చైనా ఆరోపించింది. భద్రతా ప్రమాణాలను పాటించలేదని ఇటీవల నెదర్లాండ్స్ సామాగ్రిని తిరిగి ఇచ్చారు. తన ముసుగులపై ‘సూచనలను రెండుసార్లు తనిఖీ చేయండి’ అని చైనా సమాధానం ఇచ్చింది. తాము ఇటాలియన్లకు సహాయం చేస్తున్నామని లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేస్తున్నామని చైనా అధికారులు చెప్పడం చాలా అవాస్తవమని సీనియర్ పరిపాలన అధికారి ది స్పెక్టేటర్‌తో అన్నారు. వాస్తవానికి వారు తమందరికి వైరస్ ను వ్యాప్తి చేసిన వారన్నారు.

కరోనావైరస్ వ్యాప్తిని చేసిన చేసినవారు కాబట్టి తప్పకుండా వారు ఇతర దేశాలకు సహాయం చేయాలన్నారు. వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రణాళిక చేయడానికి మిగిలిన ప్రపంచానికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వనందున సహాయం చేయడానికి వారికి ప్రత్యేక బాధ్యత ఉందన్నారు.

కరోనావైరస్ పై చైనా తప్పుడు నివేదికలు ఇచ్చిందని, దాంతో ప్రపంచం మొత్తం భరించాల్సి ఉందని ఆయన ఆరోపించారు. చైనా తన సరిహద్దుల్లోని వ్యాప్తిని తగ్గించడంతో, దాదాపు అర మిలియన్ల మంది వైరస్ ను అమెరికాకు మోసుకెళ్ళారని చెప్పారు. (దక్షిణ కొరియా మాదిరిగా ఢిల్లీలో కరోనా పరీక్షలు : కేజ్రీవాల్)