చైనా సూక్తులు: భారత్, పాక్ నిగ్రహంగా ఉండాలట
పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌లోని జేషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. యుద్ధ విమానాల ద్వారా

పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌లోని జేషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. యుద్ధ విమానాల ద్వారా
పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌లోని జేషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. యుద్ధ విమానాల ద్వారా బాంబుల వర్షం కురిపించింది. ముష్కరమూకల క్యాంపులను ధ్వంసం చేయడంతో పాటు 245మంది టెర్రిస్టులను హతమార్చింది.
భారత వైమానిక దాడులపై చైనా స్పందించింది. చైనా చిలుక పలుకులు పలికింది. ఇలాంటి సమయంలోనే నిగ్రహంగా ఉండాలని సూక్తులు చెప్పింది. భారత్, పాకిస్తాన్ మధ్య శాంతి నెలకొనాలని చైనా ఆకాంక్షించింది. భారత వైమానిక దాడులపై స్పందన తెలపాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి లుకాంగ్‌ను మీడియా కోరింది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. దాడికి సంబంధించి పూర్తి నివేదికలు ఇంకా అందలేదన్నారు. మాకు రెండు దేశాలు ముఖ్యమే అని చెప్పారు. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, శాంతి నెలకొనాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ సమాజం సహకారంతో ఉగ్రవాదంపై భారత్ తన పోరుని కొనసాగించాలని చైనా మంత్రి కోరారు.
చైనా-పాకిస్తాన్ మధ్య ఉన్న సంబంధాల గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. చైనా అండతోనే పాకిస్తాన్ రెచ్చిపోతోంది అనేది జగమెరిగిన సత్యం. చైనా సహాయ సహకారాలతోనే పాకిస్తాన్.. భారత్‌పై దాడులకు కుట్రలు చేస్తోంది. అంతేకాదు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా అడ్డుపడుతున్నది చైనానే. అలాంటి దేశం ఇప్పుడు శాంతి అంటూ కబుర్లు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.