China Trump Tariff : మాపైనే సుంకాల బెదిరింపులా? మేం కూడా తగ్గేదేలే.. పుష్ప స్టైల్‌లో ట్రంప్‌‌కు చైనా వార్నింగ్..!

China Trump Tariff : చైనా దిగుమతులపై అదనంగా 50శాతం సుంకం విధిస్తామని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో చైనా అంతే స్థాయిలో తీవ్ర హెచ్చరికలను పంపింది.

China Warn Trump

China Trump Tariff  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పెంపు హెచ్చరిక చైనాపై పెద్దగా ప్రభావం చూపినట్లు లేదు. అమెరికాకు అంతే స్థాయిలో గట్టి సమాధానం ఇచ్చేందుకు చైనా కూడా సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి.

అయితే, డ్రాగన్ ఇంకా తన ప్రణాళికలను స్పష్టంగా ప్రకటించలేదు. ట్రంప్ చైనా దిగుమతులపై అదనంగా 50 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో చైనా కూడా అదే స్థాయిలో హెచ్చరికలు పంపింది. ట్రంప్ ఇప్పటికే చైనాపై 34 శాతం సుంకాన్ని విధించారు.

Read Also : Google Pixel 10 Launch : పిక్సెల్ ఫోన్లు అంటే మజాకా.. గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ భలే ఉందిగా.. లాంచ్‌‌కు ముందే అన్నీ లీక్..!

ట్రంప్ తీరు ఇలానే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనా హెచ్చరించింది. దాంతో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రతిపాదిత అమెరికా సుంకాలను పూర్తిగా నిరాధారమైనదిగా అని డ్రాగన్ దేశం ఖండించింది.

సాధారణ ఏకపక్ష బెదిరింపు పద్ధతిగా అభివర్ణించింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. చైనా సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఎలాంటి చర్యలకైనా వెనుకాడేది లేదని చైనా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి, దీనిపై ట్రంప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. అమెరికా సుంకాల పెంపును చైనా ఖచ్చితంగా వ్యతిరేకిస్తుందిని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాకు తగిన సమాధానం ఇస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా ప్రతిజ్ఞ చేశారు.

‘సుంకాలను పెంచుతామని బెదిరిస్తూ అమెరికా తప్పులు మీద తప్పులు చేస్తోంది’ అని మంత్రిత్వ శాఖ చెప్పినట్లు జిన్హువా న్యూస్ ఏజెన్సీ వార్తాపత్రిక తెలిపింది. ‘చైనా ట్రంప్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అమెరికా నిర్ణయం ఇలానే కొనసాగితే, చైనా దానికి కచ్చితంగా బదులిస్తుంది. మార్కెట్ స్థిరత్వం అవసరమైతే సాయం కోసం సిద్ధంగా ఉన్నామని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా తెలిపింది.

ట్రంప్ సుంకాల హెచ్చరిక :
చైనా విధించిన ప్రతీకార సుంకాలను ఉపసంహరించుకోకపోతే, దానిపై అదనపు సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఏప్రిల్ 8, 2025 నాటికి చైనా దీర్ఘకాలిక వాణిజ్య దుర్వినియోగాలపైన 34 శాతం పెంపును వెనక్కి తీసుకోకపోతే, ఏప్రిల్ 9 నుంచి చైనాపై అదనంగా 50 శాతం సుంకాన్ని విధిస్తామని ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు. దాంతో పాటు, అమెరికాతో సమావేశాల అభ్యర్థనపై చైనాతో జరిగిన అన్ని చర్చలను ముగించాలని ట్రంప్ హెచ్చరించారు.

ట్రంప్ సుంకాలకు ప్రతిస్పందనగా, చైనా కూడా అమెరికాపై 34 శాతం సుంకాన్ని ప్రకటించింది. ట్రంప్ ప్రకటనతో ప్రపంచంలోని రెండు అగ్ర దేశాల మధ్య వాణిజ్య యుద్ధం పెరుగుతుందనే భయాలను రేకెత్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితిని రేకిత్తిస్తోంది.

Read Also : Apple iPhone 16e : ఆఫర్ బాగుంది బ్రో.. ఐఫోన్ 16eపై అద్భుతమైన డిస్కౌంట్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ జన్మలో రాదు..!

ట్రంప్ టారిఫ్స్ వార్ :
ఏప్రిల్ 2న చైనా, భారత్ సహా దాదాపు 60 దేశాలపై అదనపు కస్టమ్స్ సుంకాన్ని విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. చైనా ఉత్పత్తులపై అమెరికా 34 శాతం అదనపు సుంకాన్ని విధించింది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 34 శాతం సుంకాన్ని ప్రకటించింది. వాణిజ్య యుద్ధ భయం కారణంగా, స్టాక్ మార్కెట్లు అంతటా క్షీణతను చూస్తున్నాయి. ఫలితంగా అమెరికాలో కూడా ఆర్థిక వృద్ధి మందగించే పరిస్థితి కనిపిస్తోంది.