China Slams Trump: భారత్, చైనా ఆసియాకు డబుల్ ఇంజిన్లు.. ఇండియాకు బీజింగ్ ఫుల్ సపోర్ట్.. ట్రంప్ సుంకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రకటన

చాలా కాలం స్వేచ్ఛా వాణిజ్యం నుండి ప్రయోజనం పొందిన అమెరికా ఇప్పుడు టారిఫ్స్ ను బేరసారాలుగా ఉపయోగిస్తోంది.(China Slams Trump)

China Slams Trump: అమెరికా సుంకాలపై చైనా సీరియస్ అయ్యింది. అమెరికాను “ఒక బెదిరింపుదారుడు” అని అభివర్ణించింది. భారత్ లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ ట్రంప్ తీరుపై మండిపడ్డారు. భారతదేశంపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలను చైనా గట్టిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఇండియాకు చైనా గట్టిగా మద్దతిస్తుందని రాయబారి జు ఫీహాంగ్ అన్నారు.

అమెరికా చాలా కాలంగా స్వేచ్ఛా వాణిజ్యం నుండి ప్రయోజనం పొందింది, కానీ ఇప్పుడు సుంకాలను బేరసారాల చిప్‌లుగా ఉపయోగిస్తోందని ఆయన విమర్శించారు.

భారత్ పై 50శాతం వరకు అమెరికా సుంకాలను విధించిందని, ఈ చర్యను చైనా గట్టిగా వ్యతిరేకించిందని ఆయన పేర్కొన్నారు.

అంతేకాదు, మౌనంగా ఉండటం వల్ల బెదిరింపుదారుడికి ధైర్యం వస్తుందన్నారు. చైనా భారత్ తో ధృఢంగా నిలబడుతుందని ఆయన తేల్చి చెప్పారు.

“చాలా కాలం స్వేచ్ఛా వాణిజ్యం నుండి ప్రయోజనం పొందిన అమెరికా ఇప్పుడు టారిఫ్స్ ను బేరసారాలుగా ఉపయోగిస్తోంది.

అమెరికా ఇండియాపై 50శాతం వరకు సుంకాలను విధించింది. చైనా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మౌనం బెదిరింపుదారుడిని ధైర్యంగా చేస్తుంది.

చైనా భారత్ తో ధృఢంగా నిలుస్తుంది” అని చైనా రాయబారి అన్నారు.

భారతీయ వస్తువులకు చైనా మార్కెట్‌ను తెరవడం గురించి ఫీహాంగ్ మాట్లాడుతూ, రెండు దేశాలు పరస్పరం తమ మార్కెట్లలో వస్తువుల మార్పిడి ద్వారా చాలా పురోగతి సాధించవచ్చని అన్నారు.

“చైనా మార్కెట్ లోకి మరిన్ని భారతీయ వస్తువులను మేము స్వాగతిస్తాము. ఐటీ, సాఫ్ట్‌వేర్, బయో మెడిసిన్‌లో భారత్ పోటీతత్వాన్ని కలిగి ఉంది, అయితే ఎలక్ట్రానిక్ తయారీ, మౌలిక సదుపాయాల నిర్మాణం, న్యూ ఎనర్జీ రంగాలలో చైనీయులు వేగంగా విస్తరణను చూస్తున్నారు” అని ఫీహాంగ్ అన్నారు.

”చైనాలో మరిన్ని భారతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాలని చైనా వైపు కోరుకుంటుంది. పరిశ్రమల ఉమ్మడి పెంపకాన్ని ప్రోత్సహించడానికి , రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి భారత్ లోని చైనా సంస్థలకు భారత పక్షం న్యాయమైన, వివక్షత లేని వ్యాపార వాతావరణాన్ని అందించగలదని కూడా ఆశిస్తున్నాము” అని ఆయన అన్నారు.

ఎంపిక చేసిన భారతీయ వస్తువుల దిగుమతిపై అమెరికా 50 శాతం భారీ సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఇందులో 25 శాతం వాణిజ్య సుంకం రష్యన్ చమురు కొనుగోలు చేసినందుకు 25 శాతం అదనపు జరిమానా కూడా ఉంది.

రష్యా నుండి ముడి చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోంది అన్నది అమెరికా ప్రధాన ఆరోపణ.

Also Read: 25% టారిఫ్ గడువు ముంచుకొస్తున్న వేళ ట్రంప్‌కు నిక్కీ హేలీ హెచ్చరిక.. 5 పాయింట్లు.. ఈ టారిఫ్‌లు అమలు చేస్తేగనుక..