చైనాలో కరోనా వ్యాక్సిన్ ఫలితాలు అద్భుతం.. హ్యుమన్ ట్రయల్స్ సక్సెస్

  • Publish Date - May 23, 2020 / 01:01 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచ దేశాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ఇప్పటికే విస్తృత స్థాయిలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. కొన్ని పరిశోధనలు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోగా.. మరికొన్ని పరిశోధనల్లో హ్యుమన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వైరస్‌ను పూర్తిగా నిర్మూలించడం సాధ్యపడుతుందని భావిస్తున్నారు. కరోనా సోకి ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 3,30వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సాధ్యమైనంత తొందరగా కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలతో పాటు డ్రాగన్ చైనా కూడా పరిశోధనలు చేస్తోంది. ఇప్పుడు చైనా నుంచి మొట్టమొదటి వ్యాక్సిన్ తొలి దశ హ్యుమన్ ట్రయల్స్ పూర్తి అయింది. తొలి దశలో వ్యాక్సిన్ ప్రయోగంతో అద్భుతమైన ఫలితాలను సాధించినట్టు ఓ నివేదిక వెల్లడించింది. 

తొలి దశ ఫలితాలకు సంబంధించి ప్రతి పరిశీలినను ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది. యుకెలోని మెడికల్ జర్నల్  లాన్సెట్‌లో ఈ ఫలితాలను పబ్లీష్ చేసింది. వ్యాక్సిన్ ఎంతో సురక్షితమని, వ్యాధినిరోధకతను వేగంగా స్పందించేలా చేస్తుందని గుర్తించినట్టు తెలిపింది. తొలి దశ హ్యుమన్ ట్రయల్స్ లో భాగంగా పొటెన్షియల్ వ్యాక్సిన్ 108 మంది వాలంటీర్లకు ఇంజెక్ట్ చేశారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వాలంటీర్లను మూడు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులోని వారికి వేర్వేరు డోస్ లతో వ్యాక్సిన్ ఇంజెక్ట్ చేశారు. adenovirus type-5 vectored” (Ad5-nCoV) అనే రసాయనిక చర్యతో కూడిన సమ్మెళనంతో వ్యాక్సిన్ తయారు చేశారు. సాధారణ ఇన్ఫెక్షన్ మాత్రమే కాకుండా ప్రత్యేకించి వైరస్‌పై ఎలా పోరాడాలో వ్యాధినిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. 

ఆ తర్వాతి 28 రోజుల సమయంలో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎలాంటి ప్రమాదకర లక్షణాలు కనిపించలేదు. అంటే.. మనుషులు తట్టుకోగల స్థాయిలో వ్యాక్సిన్ ఉందని అర్థం. ఇంజెక్షన్ వేసిన రెండు వారాల తర్వాత యాంటీ బాడీలు SARS-Cov-2 వైరస్‌కు వ్యతిరేకంగా పెరగడం ప్రారంభిచి, 28వ రోజున గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వ్యాక్సిన్ పనితీరుపై తదుపరి విశ్లేషణ కొనసాగనున్నట్టు ది లాన్సెట్ పేపర్ తెలిపింది. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ 508 వాలంటీర్లతో ప్రారంభమైంది. Chinese Academy of Engineering సభ్యుల్లో ఒకరు, Academy of Military Medical Sciences నుంచి బయాలజీ ప్రొఫెసర్ Chen Wei నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ ట్రయల్ నిర్వహించింది. చైనాలో మరో ఇతర రెండు వ్యాక్సిన్లలో ShaCoVacc, PiCoVaccలపై హ్యుమన్ ట్రయల్స్ చేసేందుకు అనుమతి ఉంది. 

ట్రెండింగ్ వార్తలు