Chinese man lottery win wife..children's date of birth numbers
Chinese man Rs 90 crore lottery win : అతనో ఉద్యోగి. కానీ ఉద్యోగ రీత్యా ఇంటికి దూరంగా ఉండాల్సివస్తోంది. దీంతో భార్యా పిల్లలు తరచు గుర్తుకొచ్చేవారు. బెంగగా అనిపించేది. డ్యూటీలో ఉన్నంతసేపు పనిమీదే ధ్యాస ఉన్నా రూమ్ కొచ్చేసరి భార్యాపిల్లలే కళ్లల్లో మెదిలేవారు. మరి ముఖ్యంగా పిల్లలు గుర్తుకొచ్చి మనస్సు దిగులుతో నిండిపోయేది. పిల్లను గుండెలకు హత్తుకోవాలనిపించేది. భార్యను ముద్దు చేయాలనిపించేది. కానీ కుదిరేది కాదు. దీంతో ఓ వ్యాపంపెట్టుకున్నాడు భార్యా పిల్లల గుర్తుగా. ఆ వ్యాపకం కాస్తా అతని అదృష్టం పండేలా చేసింది. రూ.90 కోట్లు జాక్ పాట్ వచ్చేలా చేసింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించిన ప్రకారం 30 ఏళ్ల ఈ వ్యక్తి ఇంటికి దూరంగా ఉంటూ జాబ్ చేసుకుంటున్నాడు. దీంతో అతనికి భార్యాపిల్లలు తరచూ గుర్తుకొచ్చేవారు. వారి గుర్తుగా అతను తన భార్యాపిల్లల డేట్ ఆఫ్ బర్త్ నంబర్లతో లాటరీ టిక్కెట్లు కొనటం అలవాటుగా చేసుకున్నాడు. ఆ టికెట్లను చూసినప్పుడు భార్యా పిల్లలను చూసినట్లుగా ఫీల్ అవుతు ఆనందపడేవాడు. కానీ ఆ ఆనందమే తనకు అదృష్టం వరించేలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. అనుకోనిది జరిగితేనే కదా జీవితం అంటే..అతని విషయంలో అదే జరిగింది.
Strange Rules For employee : ఈ ఉద్యోగం మద్యంపానం, ధూమపానం, మాంసాహారం అలవాటు లేనివారికి మాత్రమే
అతను కొన్న లాటరీ టిక్కెట్ కోట్ల రూపాయలు లాటరీ తగిలింది. తన భార్యాపిల్లల డేట్ ఆఫ్ బర్త్ నంబరుతో కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్ సిరీస్.. 77 మిలియన్ల యువాన్లు(రూ. 90 కోట్లకు పైగా మొత్తం) గెలుచుకుంది. రూ. 300 పెట్టి 15 లాటరీ టిక్కెట్లు కొన్నాడు. జులై (2023)11న లాటరీ ఫలితాలు వెలువడగా…అతని పంట పడింది. 77.1 మిలియన్ల యువాన్లు గెలుచుకున్నాడు…అది భార్యా పిల్లలకు దూరంగా ఉండే అతని మనస్సు పడే వేదనే అతనిని లాటరీ రూపంలో కోట్లు వరించేలా చేసింది. అతని అదృష్టం భార్యా పిల్లలు డేటాఫ్ భర్త్ ల రూపంలో పండిందన్నమాట..