China president: చైనా అధ్యక్షుడికి వింత వ్యాధి.. మెదడులో రక్తనాళాలు ఎప్పుడైనా..
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వింత వ్యాధితో బాధపడుతున్నాడు. మెదడుకు సంబంధించిన సెరిబ్రల్ అనూరిజంతో బాధపడుతున్నట్లు చైనా మీడియా వెల్లడించింది. ఈ వ్యాధి కారణంగా గతేడాది చివరిలో జీ జిన్‌పింగ్ ఆస్పత్రిలో చేరినట్లు ...

China Precident
China president: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వింత వ్యాధితో బాధపడుతున్నాడు. మెదడుకు సంబంధించిన సెరిబ్రల్ అనూరిజంతో బాధపడుతున్నట్లు చైనా మీడియా వెల్లడించింది. ఈ వ్యాధి కారణంగా గతేడాది చివరిలో జీ జిన్‌పింగ్ ఆస్పత్రిలో చేరినట్లు స్థానిక మీడియా తెలిపింది. 2019 మార్చిలోనే జిన్‌పింగ్‌కు ఈ వ్యాధి ఉన్నట్లు బయటపడింది. చైనా అధ్యక్షుడు ఇటలీ పర్యటనలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఫ్రాన్స్ పర్యటనలో కూడా కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో తాను ఎదుర్కొంటున్న ఆరోగ్యం సమస్యపై పలురకాల పరీక్షలు నిర్వహించగా సెరిబ్రల్ అనూరిజంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
China Covid : చైనాలో కోవిడ్ ఆంక్షలు అమలు చేయకపోతే కేసులు, మరణాలు పెరుగుతాయి
2020లో షెన్‌జెన్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు జిన్‌పింగ్ దగ్గుతో చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో జిన్‌పింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ప్రచారం మొదలైంది. అయితే జిన్‌పింగ్ మాత్రం ఈ వ్యాధికి చికిత్స నిమిత్తం 2021 చివరిలో ఆస్పత్రిలో చేరినట్లు చైనా మీడియా వెల్లడించింది. జిన్‌పింగ్ ఎదుర్కొంటున్న సెరిబ్రల్ అనూరిజం అనే వ్యాధి చాలా ప్రమాదకరమైందని వైద్యులు పేర్కొన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. సెరిబ్రల్, ఇంట్రాక్రానియల్ అనూరిజం అనేది మెదడులోని ధమని అసాధారణ ఫోకల్ డైలేషన్. దీని ఫలితంగా రక్తనాళాల గోడ లోపలి కండరాల పొర బలహీనపడుతుంది. దీంతో మెదడులో రక్తం ప్లాట్ అవుతుంది. దీనికితోడు మెదడులోని రక్తనాళాలు ఎప్పుడు పగిలిపోతాయో కూడా చెప్పలేం. మెదడు చుట్టూ రక్తస్రావం అవుతుంది. దీన్ని సబ్ అరాక్నోయిడ్ హెమరేజ్ అంటారు.
China: చైనా కీలక నిర్ణయం.. 5కోట్ల కంప్యూటర్లను పక్కనపడేయనున్న ప్రభుత్వం!
ఈ రక్తస్రావం కారణంగా సదరు వ్యక్తి స్ట్రోక్ లేదా కోమాలోకి వెళ్లిపోవడం, మరణించడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అక్కడి వైద్యులు తెలిపినట్లు చైనా మీడియా వెల్లడించింది. అయితే ఈ వ్యాధితో బాధపడుతున్న జిన్‌పింగ్ వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా దేశలో కరోనా విజృంభిస్తున్నప్పటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకు కూడా జిన్ పింగ్ విదేశీ నాయకులను ఎవర్నీ కలవలేదని స్థానిక మీడియా పేర్కొంది.