భార్య టిక్‌టాక్ వీడియోలు చూసి ఓర్వలేక.. లైవ్‌లోనే పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన మాజీ భర్త..

China ex-husband who cremated the TikTok Toe star : తనను వదిలేసిన భార్య టిక్‌టాక్ వీడియోలను చూసి ఓర్వలేకపోయిన ఓ మాజీ భర్త ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఏకంగా లైవ్ స్ట్రీమ్ లోనే ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టేశాని దారుణ ఘటన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..చైనాలోని సిచువాన్‌లోని ఓ గ్రామానికి చెందిన 30 ఏళ్ల లాము అనే మహిళ టిక్‌టాక్‌లో బాగా పాపులర్ అయింది. ఆమె వీడియోలకు లైకులే లైకులు వస్తాయి. అది చూసి ఆమె మాజీ భర్త భరించలేకపోయాడు. ఆమె ఓ వీడియో చేస్తుండగా లైవ్ స్ట్రీమ్ లోనే ఆమెపై పెట్రోల్ పోయి సజీవదహనం చేశాడు. 90 శాతం ఒళ్లంతా కాలిపోవటంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది.
కాగా లామూ భర్తతో విడిపోయి తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. కానీ తనకున్న టిక్ టాక్ హాబీని మాత్రం మానుకోలేదు. వీడియోలు చేస్తునే ఉండేది. చైనీస్ టిక్‌టాక్ వెర్షన్ ‘డోయిన్’ (Douyin)లో ఆమె వీడియోలు చేస్తూ భారీ సంఖ్యలో ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె వీడియోలు పెద్దఎత్తున వైరల్ కావడంతో ఆమెకు పేరు బాగా వచ్చింది. ఆమెకు అభిమానులు పెరిగిపోయారు.
ఎంతగా అంటే డోయిన్‌లో లాముకు 7.82 లక్షల ఫాలోవర్లు ఉండగా, ఆమె వీడియోలకు ఇప్పటివరకు 63 లక్షల మంది లైక్ చేశారు. అలా ఆమె తనదైన టిక్ టాక్ ప్రపంచంలో హ్యాపీగా జీవిస్తోంది. వీడియోలు తీస్తు ఎంజాయ్ చేస్తోంది.ఈ క్రమంలో సెప్టెంబరు 14న ఇంట్లో ఉన్న లాము డోయిన్‌లో లైవ్ వీడియో చేస్తోంది. ఆ సమయంలో ఆమె మాజీ భర్త పెద్ద కత్తి పగ్గుకునొ ఇంటికి వచ్చాడు. రావటం రావటంతోనే ఇంటి తలుపులు బలంగా తన్ని బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. దీంతో లామూ కుటుంబ సభ్యులు షాక్ నుంచి తేరుకునే లోపే చూస్తుండగానే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను లాముపై పోసి నిప్పటించాడు. ఇదంతా డోయిన్‌లో లైవ్‌లో ప్రసారమయ్యాయి.
తాను వచ్చిన పని ముగించుకుని అతను అక్కడి నుంచి పారిపోయాడు. మంటల్లో కాలిపోవడంతో లాముకు తీవ్ర గాయాలయ్యాయి. అరుపులు విన్న స్థానికుల సహాయంతో కుటుంబసభ్యులు లామూను వెంటనే సిచువాన్ పబ్లిక్ ఆసుపత్రికి తరలించారు. 90 శాతం కాలిన గాయాలు కావడంతో 15 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి సెప్టెంబరు 30న ఆమె చనిపోయింది.ఈ ఘటన సిచువాన్ ప్రావిన్స్‌లో తీవ్ర కలకలం రేపింది. భర్తను వదిలేసి తన బతుకు తాను బతుకుతుంటే ఇంటికొచ్చి ఇంత దారుణంగా లామూను చంపిన అతన్ని కూడా చంపేయాలని ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
కగా..ఈ ఘటన జరిగిన రోజే లాము మాజీ భర్తను అరెస్ట్ చేసామని పోలీసులు తెలిపారు. మరోవైపు లాము హత్యపై చైనీస్ సోషల్ మీడియా వీబోలో నెటిజన్లు పెద్ద ఎత్తున లామూ పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. దాదాపు 7 కోట్ల మంది లాము గురించి పోస్టులు పెట్టినట్లు చైనీస్ మీడియా తెలిపింది.
కాగా..లాముది పేద కుటుంబం. వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో సాయం చేయాల్సిందిగా ఆమె అభిమానులను కోరారు. దీంతో అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కేవలం 24 గంటల్లోనే 10 లక్షల యువాన్లు (దాదాపు కోటి రూపాయలు) విరాళంగా అందించారు. అంటే ఆమెకు ఫ్యాన్స్ నుంచి ఎంతటి స్పందన ఉందో..ఆమెపై ఎంత అభిమానం పెంచుకున్నారో ఊహించుకోవచ్చు. కానీ ఫ్యాన్స్ తమ టిక్ టాక్ స్టార్ ని బ్రతికించమని దేవుడిని వేడుకున్నా ఫలితం లేకపోయింది. అలా ఆమె కథ విషాదంగా ముగిసిపోయింది.