శుక్ర గ్రహానికి సమీపంలో ఉన్న “సిటీ కిల్లర్”గా పిలిచే అతి పెద్ద గ్రహశకలాల సమూహం వల్ల భూమికి ఏదో ఒకరోజు ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వాటిని కో-ఆర్బిటల్ ఆస్టరాయిడ్స్‌గానూ పిలుస్తారు.
వీటిని ట్రాక్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే.. అవి తరచూ గ్రహాల కక్ష్యలో ప్రయాణించకుండానే గ్రహాల సమీపంలోకి వస్తుంటాయి. వాటికి స్థిరమైన గతి మార్గము అంటూ ఉండదు.
సావో పాలో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు చేసిన కొత్త అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి. శుక్ర గ్రహం చుట్టూ 20 అతిపెద్ద గ్రహశకలాలు ఉన్నాయి. వీటిలో ‘ట్రోజన్’ గ్రహశకలాలు కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
Also Read: ఐపీఎల్ 2025 ముగిసింది.. ఇక T20 World Cup 2026లో ఈ ప్లేయర్లకు ఛాన్స్ దక్కినట్లే?
ఇవి ఓ గ్రహం ముందు లేదా వెనుక భాగంలో ఉన్నాయి. సూర్యుడి చుట్టూ ఆ గ్రహం తిరిగే కక్ష్యలో ఆ ‘ట్రోజన్’ గ్రహశకలాలు కనపడ్డాయి. ఆ 20 అతిపెద్ద గ్రహశకలాల్లో ‘ట్రోజన్’ గ్రహశకలాలే కాకుండా జూజ్వీగా పిలిచే క్వాసీ-మూన్ కూడా ఉంది.
క్వాసీ-మూన్ అంటే నిజమైన చందమామ కాదు. ఈ 20 కిల్లర్ గ్రహశకలాలు మన సౌర వ్యవస్థకు చెందిన అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి ఉద్భవించాయి. ఒక్కో గ్రహశకలం 140 మీటర్ల సైజులో (460 అడుగులు) ఉంటుంది.
అవి భూమిని తాకితే ఓ నగరం మొత్తాన్ని నాశనం చేసేస్తాయి. ఆ గ్రహశకకాలు ప్రస్తుతం ఉన్న చోటు ఉంటే మనకు ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే, వాటికి స్థిరమైన కక్ష్య మార్గం లేదు.
దీంతో భూ గురుత్వాకర్షణ శక్తి ఆ గ్రహశకలాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిని.. వాటి ప్రస్తుత కక్ష్య మార్గం నుంచి లాగితే అవి భూమిని ఢీ కొట్టే ముప్పు ఉంది. అవి ఎప్పుడు దూసుకొస్తాయన్న విషయాన్ని కూడా గుర్తించలేం.