CM Jagan : యుక్రెయిన్‌లోని తెలుగు వారి కోసం అధికారుల‌ను నియ‌మించిన సీఎం జగన్

యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులకు స‌హ‌కారం అందించేందుకు ఇద్ద‌రు అధికారుల‌ను నియ‌మించింది. అంతేకాదు వారిని సంప్రదించాల్సిన నెంబర్లు కూడా తెలిపింది.

CM Jagan Ukraine : సైనిక చర్య పేరుతో యుక్రెయిన్ పై రష్యా దాడికి దిగింది. యుక్రెయిన్ ను మూడు వైపుల నుంచి చుట్టుముట్టిన రష్యా బలగాలు.. బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో యుక్రెయిన్ దేశ పౌరులు, అక్కడ ఉంటున్న ఇతర దేశస్తులు ప్రాణభయంతో ఆందోళన చెందుతున్నారు. తమను కాపాడాలని అక్కడ చిక్కుకుపోయిన విదేశీయులు వేడుకుంటున్నారు. కాగా, యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన వారిలో తెలుగు వారు కూడా ఉన్నారు. యుక్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ పౌరుల‌ను సుర‌క్షితంగా ర‌ప్పించాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు.

Ukraine Tension : యుక్రెయిన్‌లో 18వేల మంది భారతీయులను తీసుకొచ్చేందుకు చర్యలు : విదేశాంగ శాఖ

CM Jagan Appoints Special Officers For Stranded AP People In Ukraine

తాజాగా ఏపీ ప్రభుత్వం మ‌రో అడుగు ముందుకేసింది. యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులకు స‌హ‌కారం అందించేందుకు ఇద్ద‌రు అధికారుల‌ను నియ‌మించింది. అంతేకాదు వారిని సంప్రదించాల్సిన నెంబర్లు కూడా తెలిపింది. వీరిలో నోడ‌ల్ అధికారిగా నియ‌మించిన ర‌విశంక‌ర్‌ను 9871999055 నెంబ‌ర్ లోను, ప్ర‌త్యేక అధికారిగా నియ‌మితులైన గీతేశ్ శ‌ర్మ (రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి)ని 7531904820 నెంబ‌ర్ లోను సంప్ర‌దించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది.

Crude-Gold Price : రష్యా-యుక్రెయిన్‌ వార్‌తో క్రూడ్‌, బంగారానికి రెక్కలు

యుక్రెయిన్‌పై ర‌ష్యా దాడుల నేప‌థ్యంలో యుక్రెయిన్‌లో చిక్కుకున్న ఇత‌ర దేశాల పౌరుల కోసం ఆయా దేశాల విదేశాంగ కార్యాల‌యాలు చ‌ర్య‌లు మొద‌లుపెట్టాయి. యుక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయుల కోసం భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇప్ప‌టికే రంగంలోకి దిగారు. ఆ దేశంలో చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా కేంద్రానికి లేఖ రాశారు.

కాగా, యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేసింది. తమ గగనతలాన్ని యుక్రెయిన్ మూసివేయడమే ఇందుకు కారణం.

War in Ukraine: నిముషాల వ్యవధిలో మారిపోతున్న పరిణామాలు: యుక్రెయిన్ వైమానిక, మిలిటరీ స్థావరాలే లక్ష్యమన్న రష్యా

భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 8.50 గంటలకు యుక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభించింది. బాంబుల వర్షం కురిపించింది. దాడులపై తమ నిర్ణయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమర్థించుకున్నారు. అయితే, యుక్రెయిన్ ను స్వాధీనం చేసుకునే ఉద్దేశం తమకు లేదని, యుక్రెయిన్ సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తున్నామని వెల్లడించారు. యుక్రెయిన్ సైనిక శక్తిని నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు.

CM Jagan Appoints Special Officers For Stranded AP People In Ukraine

ర‌ష్యా, యుక్రెయిన్ల మ‌ధ్య యుద్ధం.. ప్ర‌పంచ దేశాల‌ను కలవరానికి గురిచేస్తోంది. మిలిట‌రీ ఆప‌రేష‌న్ అంటూ యుక్రెయిన్‌పై ర‌ష్యా విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ర‌ష్యా చేస్తున్న‌ది మిలిట‌రీ ఆప‌రేష‌న్ కాద‌ని, ర‌ష్యా త‌మ‌పై యుద్ధానికే తెగ‌బ‌డుతోంద‌ని ఉక్రెయిన్ వాదిస్తోంది. ఇప్ప‌టికే ఉక్రెయిన్‌పై ర‌ష్యా బాంబుల వ‌ర్షాన్ని కురిపించ‌గా.. తానేమీ త‌క్కువ తిన‌లేద‌న్న‌ట్లుగా ర‌ష్యా ఫైట‌ర్ జెట్ల‌ను కూల్చేశామ‌ని ఉక్రెయిన్ ప్ర‌క‌టించింది.

ఇరు దేశాల మ‌ధ్య సాగుతున్న పోరు అంత‌కంత‌కూ భీక‌ర రూపం దాలుస్తోంది. త‌మ‌పై దాడికి తెగ‌బ‌డ్డ ర‌ష్యాతో ఇక‌పై తాము దౌత్య సంబంధాల‌ను నెర‌పేదిలేద‌ని యుక్రెయిన్ తేల్చేసింది. ఈ మేర‌కు ర‌ష్యాతో దౌత్య సంబంధాల‌ను తెంచేసుకుంటున్న‌ట్టుగా ప్ర‌క‌ట‌న చేసింది.

ట్రెండింగ్ వార్తలు