Train Tracks Flames: అమెరికాలో రైలు పట్టాలపై చలిమంటలు, ఎందుకో తెలుసా?

అమెరికాలోని చికాగోలో ఇటీవల రైలు పట్టాలపై అక్కడి అధికారులు చలి మంటలు వేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Train Tracks Flames: అమెరికాలోని చికాగోలో ఇటీవల రైలు పట్టాలపై అక్కడి అధికారులు చలి మంటలు వేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అది చూసిన నెటిజన్లు.. రైలు సిబ్బందే ఇలా పట్టాలను తగలబెడుతున్నారు ఏంటా అంటూ తొలుత అవాక్కైనా.. ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అమెరికాలోని కొన్ని ఉత్తర రాష్ట్రాల్లో డిసెంబర్ నుంచి విపరీతమైన చలి ఉంటుంది. పెద్ద పెద్ద నగరాలు సైతం మంచుతో కప్పబడి ఉంటాయి. రోడ్లపై మోకాలు లోతు మంచుతో వాహనదారులు, ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతుంటారు. ఇక తీవ్రమైన మంచు ధాటికి రైలు పట్టాలు సంకోచించుకుంటాయి.

Also read: Mahesh Bank Hacking: మహేష్ బ్యాంకు హ్యాకింగ్‌ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

అటువంటప్పుడు ఆ పట్టాలపై రైళ్లు తిరిగితే పట్టాలు విరిగిపోయి ప్రమాదం ఉంది. పట్టాలపై మంచును తొలగించడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే ట్రాక్ పై అక్కడక్కడా మంటలు వేస్తుంటారు రైల్వే సిబ్బంది. మంటల వేడి ధాటికి రైలు పట్టాలు సంకోచించడంతో రైలు చక్రాలకు మరింత పట్టు దొరుకుతుంది. అమెరికాలో అతిపెద్ద ట్రైన్ టెర్మినల్స్ లో ఒకటైన చికాగో రైల్వే స్టేషన్ కు నిత్యం వందలాది రైళ్లు వస్తుంటాయి. అదే సమయంలో చికాగోలో జనవరి నెలలో విపరీతమైన మంచు కురుస్తుంది. దీంతో ఇటీవల రైలు పట్టాలపై మంచును కరగబెట్టేందుకు అక్కడి సిబ్బంది మంటలు వేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు అతి శీతల వాతావరణం అగ్రరాజ్యాన్ని వొణికిస్తుంది. చికాగో, మిచిగాన్, ఇండియానా పోలీస్, వాషింగ్టన్, న్యూయార్క్ ప్రాంతాలలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరో రెండు వారాల పాటు అమెరికాలో చలి తీవ్రత కొనసాగుతుందని ఫాక్స్ న్యూస్ వాతావరణ విభాగం తెలిపింది.

Also read: Corona India: దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు కొత్తగా ఎన్నంటే?

ట్రెండింగ్ వార్తలు