ఫ్యామిలీ ప్లానింగ్ ఇక ఈజీ : గర్భ నిరోధానికి జ్యుయెలరీ టెక్నిక్ 

రానున్న రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఎంతో ఈజీ కానుంది. కుటుంబ నియంత్రణ కోసం ఎన్నో పద్ధుతులు అందుబాటులో ఉన్నప్పటికీ భవిష్యత్తులో సరికొత్త టెక్నిక్ త్వరలో అందుబాటులోకి రానుంది.

  • Published By: sreehari ,Published On : April 4, 2019 / 02:23 PM IST
ఫ్యామిలీ ప్లానింగ్ ఇక ఈజీ : గర్భ నిరోధానికి జ్యుయెలరీ టెక్నిక్ 

Updated On : April 4, 2019 / 2:23 PM IST

రానున్న రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఎంతో ఈజీ కానుంది. కుటుంబ నియంత్రణ కోసం ఎన్నో పద్ధుతులు అందుబాటులో ఉన్నప్పటికీ భవిష్యత్తులో సరికొత్త టెక్నిక్ త్వరలో అందుబాటులోకి రానుంది.

రానున్న రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఎంతో ఈజీ కానుంది. కుటుంబ నియంత్రణ కోసం ఎన్నో పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ భవిష్యత్తులో సరికొత్త టెక్నిక్ త్వరలో అందుబాటులోకి రానుంది. మహిళల్లో గర్భ నిరోధకానికి ఈ కొత్త టెక్నిక్ మరింత ఆకర్షణగా నిలువనుంది. ప్రస్తుతం మహిళల్లో అవాంఛిత గర్భాన్ని నిరోధించడానికి సైన్స్ పరంగా ఎన్నో మెడిసిన్స్, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలుసు. ఫ్యామిలీ ప్లానింగ్ కోసం చూస్తున్న మహిళల్లో ఒక సింపుల్ ట్రిక్ తో గర్భాన్ని నిరోధించవచ్చు. అదే.. జ్యుయెలరీ టెక్నిక్. అదేంటీ.. జ్యుయెలరీకి గర్భ నిరోధానికి లింక్ ఏంటి? అని అనుకుంటున్నారా? అసలు మహిళలు ధరించే జ్యుయెలరీతో గర్భాన్ని నిరోధించడం సాధ్యమేనా? అంటే అవును అని అంటున్నారు పరిశోధకులు. 

చెవి రింగులు, నక్లేస్లే నిరోధకాలు  :
చెవి పొగులు, ఉంగరాలు లేదా నక్లేస్ లు.. కేవలం వీటితోనే గర్భాన్ని నిరోధించవచ్చనని ఓ అధ్యయనం చెబుతోంది. ఎలానంటే.. గర్భాన్ని నిరోధించే హార్మోన్లతో కూడిన ప్యాచులను మహిళలు ధరించే జ్యుయెలరీకి అప్లయ్ చేయడం ద్వారా సాధ్యమేనని పరిశోధనలు చెబుతున్నాయి. మహిళల చర్మానికి అంటుకుని ఉండే జ్యుయెలరీకి గర్భ నిరోధక హార్మోన్లును ఇంజెక్ట్ చేయడం ద్వారా హార్మోన్ డ్రగ్స్ నేరుగా చర్మంలోనికి చొచ్చుకునిపోతాయి. తద్వారా మహిళల్లో గర్భ నిరోధాన్ని నిరోధించేందుకు వీలు ఉంటుందని జనరల్ ఆఫ్ కంట్రోలడ్ రిలీజ్ లో ప్రచురితమైన నివేదిక వెల్లడించింది. ఈ టెక్నిక్ కు సంబంధించి టెస్టింగ్ తొలి దశలో.. గర్భ నిరోధక జ్యుయెలరీ నుంచి తగిన మోతాదులో హార్మోన్లు విడుదల అవుతాయని గుర్తించారు. అయితే ఇప్పటివరకూ మనుషులపై మాత్రం ఎలాంటి టెస్ట్ చేయలేదు. 

అవాంఛిత గర్భం వద్దనుకుంటే : 
ఈ కొత్త టెక్నిక్ ద్వారా రోజువారీగా ఎంతమందికి ఎంత మొత్తంలో డ్రగ్ మోతాదు పెంచాలనేదానిపై పరిశోధనలు జరుపుతున్నారు. ఈ జ్యుయెలరీ టెక్నిక్ ఆధారంగా చర్మం ద్వారా ఇతర ఔషదాలను కూడా డెలివరీ చేసేందుకు వీలుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ‘గర్భ నిరోధకానికి ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మహిళల్లో ఒకరిలో ఒకలా ఉంటుంది’ అని అమెరికాలోని జార్జియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మార్క్ ప్రాయూస్నిట్జ్ తెలిపారు. ఎందుకంటే.. మహిళల్లో జ్యుయెలరీ పెట్టుకోవడమనేది ఎప్పటినుంచో డెయిలీ రొటిన్ గా జరుగుతోంది. దీంతో ఈ టెక్నిక్ ద్వారా ఔషద నియామవళిని సులభతరం చేయవచ్చు. మహిళల్లో ఎవరైతే అవాంఛిత గర్భాన్ని వద్దనుకుంటారో వారికి ఈ జ్యుయెలరీ టెక్నిక్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని ప్రాయూస్నిట్జ్ అభిప్రాయపడ్డారు. గర్భాన్ని నిరోధించే జ్యుయెలరీకి ముందు.. ట్రాన్స్ డెర్మల్ ప్యాచ్ టెక్నాలజీ ఇప్పటికే అడ్మిన్ డ్రగ్స్ లో వాడుతున్నారు. ఇందులో మోషన్ సిక్ నెస్, పొగ త్రాగడం మాన్పించడం, రుతుక్రమాన్ని కంట్రోల్ చేయడం వంటి సమస్యలపై ఈ టెక్నాలజీని వాడుతున్నారు. కానీ, అంతకుముందు జ్యుయెలరీలో మాత్రం ఈ టెక్నాలజీ అందుబాటులో లేదు. 

జంతువుల నమూనాలపై టెస్టింగ్ :
ఈ జ్యుయెలరీ డ్రగ్ హార్మోన్లపై రీసెర్చర్లు.. జంతువుల నమూనాలపై (టెస్టింగ్) పరిశోధన చేశారు. తొలుత పందుల చెవుల మీద పరిశోధన మొదలుపెట్టారు. పందుల చెవుల వెనుకభాగం వైపు లెవనోర్జెస్ట్రెల్ హార్మోన్ తో కూడిన టెస్ట్ ప్యాచులను పూతలా పూశారు. వెంటుక్రలు లేని ఎలుకలపై కూడా ఇదే డ్రగ్స్ ను అప్లయ్ చేశారు. నిద్రించే సమయంలో మాత్రం వాటి చెవుల రింగులను తొలగించారు. 16 గంటల పాటు ప్యాచ్లను అప్లయ్ చేస్తూ వచ్చారు. 8 గంటల తర్వాత వాటిని తొలగించారు. చెవి రింగులు తొలగించిన సమయంలో కూడా హార్మోన్ల స్థాయి పడిపోయినట్టు టెస్టింగ్ లో గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. అదే సమయంలో ప్యాచ్ నుంచి రక్తప్రవాహంలో అవసరమైన హార్మోన్లు స్రవించినట్టు గుర్తించారు.

హార్మోన్ డ్రగ్.. రక్తంలో కలిస్తే చాలు :
చెవి రింగు ప్యాచ్ ను చర్మంలోని మూడు పొరలపై రీసెర్చర్లు టెస్టింగ్ చేశారు.  ఒక స్వ్కెయిర్ సెంటీమీటర్ దూరంలో టెస్ట్ డ్ ప్యాచులను అమర్చారు. ఇందులో ఒకటి చెవి వెనుక వైపు భాగం, రెండోవది మణికట్టు లోపలి భాగం, నెక్లెస్ లేదా ఉంగరం పెట్టే భాగంలో ఉంచారు. మధ్య పొరపై ఉండే ప్యాచ్ లో గర్భ నిరోధక డ్రగ్ ను అప్లయ్ చేశారు. బయటి భాగం చర్మంపై అతుక్కుని ఉండటం కారణంగా హార్మోన్ సులభంగా లోపలికి చొచ్చుకునిపోయే అవకాశం ఉంటుంది. చర్మంపై నుంచి హార్మోన్ డ్రగ్ ఒకసారి రక్తప్రవాహంలోకి ప్రవాహించి నేరుగా శరీరంలో కలిసిపోతుంది.

ఇదే టెక్నిక్ మనుషుల్లో కూడా గర్భ నిరోధానికి ఉపయోగ పడుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అయితే.. చెవి వెనుక రింగులను మాత్రం వారానికి ఒకసారి తరుచూ మార్చాల్సిన అవసరం ఉంటుంది. గర్భ నిరోధక జ్యుయెలరీ టెక్నాలజీని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వినియోగంలోకి తెచ్చేందుకు డిజైన్ చేశారు. హెల్త్ కేర్ సర్వీసులు తక్కువగా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.