కరోనాతో చనిపోతున్న డాక్టర్లు: భయాందోళనలో సామాన్యులు

  • Publish Date - March 30, 2020 / 05:37 AM IST

మనకు ఏమైనా బాగలేకపోతే డాక్టర్లు దగ్గరికి వెళ్తాం కదా? కరోనా దెబ్బకు డాక్టర్లు కూడా వణుకుతున్నారు. వణకడమే కాదు.. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కొందరు డాక్టర్లు.. కరోనా భయంతో లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు, బంద్‌లు.. ఇలా ఎన్ని పెట్టినా కూడా ఇటలీలో మాత్రం కరోనా పంజా దెబ్బకు చనిపోతున్నారు అక్కడి ప్రజలు. ఆ దేశంలో ఇప్పటివరకు 10,779 మరణాలు నమోదయ్యాయి.

అయితే కరోనా పేషెంట్లకు వైద్యం చేస్తున్న డాక్టర్లు కూడా చనిపోవడం.. ఇప్పుడు ఇటలీలో కలవరపెడుతుంది. ఆ దేశంలో 50 మంది డాక్టర్లు కరోనాతో చనిపోయినట్టు అక్కడి నేషనల్​ ఫెడరేషన్ ఆఫ్​ ఆర్డర్స్ ఆఫ్ సర్జన్స్ అండ్ డెంటిస్ట్స్ వెల్లడించింది. కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న లాంబార్డీకి చెందిన డాక్టర్లే అందులో 17 మంది ఉన్నట్లు వెల్లడించింది అక్కడి ప్రభుత్వం.

అయితే డాక్టర్లే ఇటీలీలో చనిపోవడంతో అక్కడి ప్రభుత్వానికి తలనొప్పి మొదలైంది. డాక్టర్లే చనిపోవడంతో సామాన్య ప్రజలు భయపడుతున్నారు. 

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం నమోదైన కరోనా కేసులు 7,22,196 మరణాలు 33,976 కోలుకున్నవారు 1,51,766 అమెరికాలో కేసులు 1,42,178… మరణాలు 2,484 ఇటలీ – 97,689… మరణాలు 10,779 చైనా – 81,470… మరణాలు 3,304 స్పెయిన్ – 80,110… మరణాలు 6,803

Also Read | RBI moratorium: తప్పించుకోకుండా EMIలు కట్టేయడమే బెటర్