క్వారంటైన్ ఉల్లంఘించిందని పట్టుకోపోతే పోలీసుపై ఉమ్మేసిన ముస్లిం మహిళ

క్వారంటైన్ ఉల్లంఘించిందని పట్టుకోపోతే పోలీసుపై ఉమ్మేసిన ముస్లిం మహిళ

Updated On : March 28, 2020 / 1:07 PM IST

కరోనాకు నివారణ ఒక్కటే మార్గం ఇంట్లోనే ఉండండి అని చెప్తున్నా వినకుండా రోడ్లపై తిరుగుతుంటే పోలీసులు మాత్రం ఏం చేస్తారు. తీసుకెళ్లి లోపలేయడం తప్ప. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న కరోనా ప్రభావం ఆస్ట్రేలియాలోనూ అదే ఎఫెక్ట్ కనబరుస్తుంది. లాక్ డౌన్‌ను ఉల్లంఘించి రోడ్డుపై 120కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న మహిళ కారును పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. కార్లో నుంచి బయటకు లాగి ప్రశ్నించినందుకు మహిళకు కోపం వచ్చింది. 

కారులో నుంచి బయటకు రానని.. తాను కొవిడ్-19టెస్టు చేయించుకునేందుకు వెళ్తున్నానంటూ చెప్పింది. అయినా వినకుండా పోలీస్ వాదిస్తుండటంతో ఉమ్మేస్తానని బెదిరించింది. ‘నాపై ఉమ్మి వేయొద్దు. అలా చేస్తే నిన్ను కింద విసిరేస్తా’ అని పోలీసు అంటున్నా వినలేదు. మళ్లీ ఒకసారి ఉమ్మి వేయడంతో ఆమెను నేలపకి తోసేసి కాసేపటికి అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడంతో పాటు కొవిడ్ టెస్టులకు పంపించారు. 

ఆమె చర్యలకు నెటిజన్లు పలు రకాల కామెంట్లతో వ్యతిరేకిస్తున్నారు. ఒక వ్యక్తి ఆమెను కరోనావైరస్ జిహాదీ అంటూ కామెంట్ చేశాడు. ఇంకొకరు ఈమె బయో టెర్రరిస్టు అంటూ వ్యాఖ్యానించాడు. 

ఇన్ఫోసిస్ ఉద్యోగిది ఇదే తంతు:
” చేయి చేయి కలపండి…బయటకు వెళ్ళి బహిరంగంగా తుమ్మండి..కరోనా వ్యాప్తి చేయండి ” అని బెంగుళూరులోని ఇన్ఫోసిస్ కంపెనీలో పని చేస్తున్న ముజిబ్ మహమ్మద్(25) అనే యువకుడు తను యాక్టివ్ గా ఉండే ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  

ఒక వైపు ప్రపంచమంతా కరోనా వ్యాధి భయంతో హడలి పోయి ఇళ్లు వదిలి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటిస్తుంటే ఈ పోస్టు మరింత ప్రకంపనలు రేపింది. అతను పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే అది వైరల్ అయ్యింది . దీంతో అలర్టైన పోలీసులు రంగంలోకి  దిగారు. సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడిని అరెస్టు చేసి  కేసు నమోదు చేశారు. 
ఈ వ్యవహారంపై ఇన్ఫోసిస్ కూడా స్పందించి సదరు వ్యక్తిని ఉద్యోగంలో నుంచి తొలగించింది.