లాక్‌డౌన్ ప్రభావం.. ముందుగా, భారీగా పడిన పరిశ్రమ ఏవియేషన్. ఎయిర్ లైన్స్ ద్వారా రాకపోకలు నిలిపేసి విదేశాల నుంచి కరోనా రాకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నించి ఇండియా. ఆ తర్వాత కొద్ది రోజులకు మార్చి 25నుంచి ఏప్రిల్ 14వరకూ 21రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. ఇక రాబోయే మంగళవారంతో ముగియనున్న లాక్‌డౌన్‌తో విమాన సర్వీసులు పునరుద్దరించాలని చూస్తున్నారు.
వీటిని కొన్ని ప్రాంతాలకే అది కూడా దశల వారీగానే ఓపెన్ చేయాలని భావిస్తున్నారు. మొదలుపెట్టగానే ఆర్థిక భారం ఎక్కువ కాకుండా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎయిర్ లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రొనొజాయ్ దత్తా ఉద్యోగులకు తాను తీసుకున్న నిర్ణయాన్ని ఒక లెటర్ ద్వారా వెల్లడించారు. మన భవిష్యత్ కోసం ఈ ప్లాన్లు తప్పక అమలు చేయాలి.(లాక్‌డౌన్ టైమ్‌లో టిక్‌టాక్ టిక్‌టాక్… ఇండియన్స్ ఎక్కువగా అందులోనే!)
మన దగ్గర ఉన్న నిధులతో సమస్యలను అధిగమించాలి. ఈ పథకాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఎయిర్‌క్రాఫ్ట్ర్‌లను తరచూ తుడుస్తూ మరింత శుభ్రంగా ఉంచాలి. కొంతకాలం పాటు మీల్స్ సర్వీసును తొలగించాలనుకుంటున్నాం. సగం బరువుతోనే విమానాలను నడపాలనుకుంటున్నాం. త్వరలోనే తుది నిర్ణయంతో మీ ముందుకు వస్తా అంటూ మెయిల్ లో పేర్కొన్నారు.
డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వీటితో పాటు సామాజిక దూరం అంశాన్ని కూడా పాటించాలని తెలిపింది. ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్‌పోర్ట్, పాసింజర్లు అంతా సోషల్ డిస్టన్స్ పాటించాలి. విమానాల్లోనూ చివరి 3 అడ్డు వరుసలు ఖాళీగా.. ముగ్గురు కూర్చొనే సీట్లలో కేవలం మధ్య సీట్లోనే కూర్చొనే విధంగా ఆర్డర్లు జారీ చేసింది.