Singer Jake Flint Dies : అసలేం జరిగింది.. పెళ్లైన కొన్ని గంటలకే ప్రముఖ సింగర్ హఠాన్మరణం

ప్రముఖ సింగర్ జేక్ ఫ్లింట్ పెళ్లైన కొన్ని గంటలకే మృతి చెందాడు. జేక్ ఫ్లింట్ వయసు 37ఏళ్లు. శనివారమే అతడికి పెళ్లి అయ్యింది. అయితే, పెళ్లైన కొన్ని గంటలకే నిద్రలోనే జేక్ ఫ్లింట్ మరణించడం సంచలనంగా మారింది.

Singer Jake Flint Dies : అసలేం జరిగింది.. పెళ్లైన కొన్ని గంటలకే ప్రముఖ సింగర్ హఠాన్మరణం

Updated On : November 30, 2022 / 10:08 PM IST

Singer Jake Flint Dies : అమెరికాలోని ఓక్లహోమాకు చెందిన ప్రముఖ సింగర్ జేక్ ఫ్లింట్ పెళ్లైన కొన్ని గంటలకే మృతి చెందాడు. జేక్ ఫ్లింట్ మరణించినట్లు అతడి మేనేజర్ క్లిఫ్ డోయల్ ధృవీకరించాడు. జేక్ ఫ్లింట్ వయసు 37ఏళ్లు. 1985లో ఓక్లహోమాలో జన్మించాడు. జేక్ ఫ్లింట్.. స్థానికంగా ఫేమస్ సింగర్. ఈ నెల 26న అతడికి పెళ్లి అయ్యింది. బ్రెండా విల్సన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది. అయితే, పెళ్లైన కొన్ని గంటలకే నిద్రలోనే జేక్ ఫ్లింట్ మరణించడం సంచలనంగా మారింది.

Also Read : Man Dies While Dancing : వీడియో.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి, షాక్‌లో కుటుంబసభ్యులు

ఈ విషయం తెలిసిన జేక్ అభిమానులు షాక్ లో ఉండిపోయారు. జేక్ మృతికి సంతాపం తెలిపారు. వాట్స్ యువర్ నేమ్, లాంగ్ రోడ్ బ్యాక్ హోం, కౌ టౌన్, ఫైర్ లైన్ వంటి హిట్ ఆల్బమ్స్‌తో జేక్ అమెరికాలో పాప్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జేక్ మొదటి ఆల్బమ్ అయామ్ నాట్ ఓకే 2016లో విడుదలైంది. ఆ తర్వాత వరుసగా చాలా ఆల్బమ్స్‌తో మ్యూజిక్ ప్రియులను అలరించాడు. లైవ్ ఈవెంట్స్‌ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. కాగా, జేక్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

భర్త మృతితో భార్య బ్రెండా షాక్ లో ఉండిపోయింది. ఫేస్ బుక్ లో కంటతడి పెట్టించే పోస్ట్ పెట్టింది. ”ఈ సమయంలో మేము మా పెళ్లి ఫోటోలు చూసుకోవాలి. కానీ, నేను నా భర్త అంత్యక్రియలు చేస్తున్నా. ఇలాంటి బాధ ఎవరికీ రాకూడదు. నా గుండె తరుక్కుపోతోంది. నా భర్త లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న” అని ఎమోషనల్ అయ్యింది.