African mask
African mask : ఓ జంట తమ దగ్గర ఉన్న ఓ మాస్క్‌ను రూ.13,000 లకు అమ్మేసారు. దానికి వేలంలో రూ.35 కోట్లు రావడంతో ఆ జంటకు దాని విలువ తెలిసి కోర్టుకెళ్లారు. ఇంతకీ అంత ధర పలికిన మాస్క్ స్పెషాలిటీ ఏంటి? అంటే..
ఫ్రాన్స్‌లోని నిమ్స్‌కు చెందిన ఓ జంట 2021 లో తమ ఇంట్లో పాత వస్తువుల్ని క్లియర్ చేస్తున్నారు. ఆ సమయంలో తమ దగ్గర ఉన్న ఆఫ్రికన్ మాస్క్‌ను Mr Z అనే ఆర్ట్ డీలర్‌కి 129 పౌండ్లకి (రూ.13,208) అమ్మేశారు. కొన్ని నెలల తర్వాత ఆ ఆర్ట్ డీలర్ వేలంలో ఆ మాస్క్‌ని 3.6 మిలియన్ పౌండ్లకు (రూ.36,86,17320) విక్రయించాడు. తాము అమ్మిన మాస్క్ అంత విలువైనదని.. వేలంలో అంత ధర పలికిందని వార్తా పత్రికలో వచ్చిన న్యూస్ ద్వారా తెలుసుకున్న ఆ జంట Mr Z పై కేసు పెట్టారు. అతనికి దాని విలువ తెలిసి తమను మోసం చేసాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Theft of 200 shoes : రూ.10 లక్షల విలువైన షూలు కొట్టేసారు.. పాపం అన్నీ కుడి పాదానికి వేసుకునేవట..
చూడటానికి వింతగా అనిపిస్తున్న ఆ మాస్క్‌ను గాబన్‌లోని ఫాంగ్ ప్రజలు పెళ్లిళ్లు, అంత్యక్రియల సమయంలో వాడతారట. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని మ్యూజియంలలో మాత్రమే ఈ మాస్క్‌లు కనిపిస్తాయట. విలువైన ఈ మాస్క్‌ను ఆ జంట స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది.