ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు హైదరాబాద్ మెడిసిన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ మందుకు అభివృద్ధికి సంబంధించి అనేక ఫార్మా కంపెనీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించే remdesivir డ్రగ్ ను సుమారుగా 10 లక్షల డోసులు తయారు చేయనుంది. ఈ బాధత్యను ప్రముఖ ఫార్మా కంపెనీ Hetero భుజాన ఎత్తుకుంది. వచ్చే నెలలో అంటే.. జూన్ నాటికి అమెరికాకు చెందిన గిలాడ్ సైన్సెస్ భాగస్వామ్యంతో ఈ ఔషధాన్ని తయారు చేయనుంది. ఆ వెంటనే అమెరికాకు ఈ డ్రగ్ ఎగుమతి చేసే అవకాశం ఉందని కంపెనీ సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కరోనా నియంత్రణకు వాడే లోపినవిర్, రిటొనవిర్ డ్రగ్స్ తయారీలో హైదరాబాద్‌కు చెందిన అరవిందో ల్యాబ్స్ సహా పలు ఫార్మా సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తయారీకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ICMR) ఏర్పాటుచేసిన బృందంలో నగరానికి చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థకు చోటు దక్కింది. వ్యాక్సిన్ మరో 3 నుంచి 4 నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
నగర పరిధిలో 1,500కు పైగా బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియట్ కంపెనీలు కూడా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచే, వైరస్ జబ్బులను నియంత్రించే మందుల తయారీ బాధ్యతలకు నగరంలోని పలు ఔషధ కంపెనీలు కృషి చేస్తున్నాయి. ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లోనూ 24 గంటల పాటు సేవలు అందించేలా కంపెనీలు అనుమతులు మంజూరు చేసింది.