Cyclone Chido: మాయోట్‌లో ఛీడో తుపాను బీభత్సం.. వేలాది మంది మృతి?

హిందూ మహాసముద్రంలో ఫ్రెంచ్ ద్వీపకల్పం మయోట్ లో ఛీడో తుపాను బీభత్సం సృష్టించింది. 200 కిలోమీటర్లకుపైగా వేగంతో రాకాశి గాలులు

Cyclone Chido

Cyclone Chido in Mayotte: హిందూ మహాసముద్రంలో ఫ్రెంచ్ ద్వీపకల్పం మయోట్ లో ఛీడో తుపాను బీభత్సం సృష్టించింది. 200 కిలోమీటర్లకుపైగా వేగంతో రాకాశి గాలులు వీయడంతో అనేక ప్రాంతాల్లో నివాసాలు ధ్వంసమయ్యాయి. గత 90 సంవత్సరాల్లో మయోట్ ఇలాంటి తుపానును చూడలేదని స్థానికులు చెప్పారు. ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఈ తుపాను కారణంగా మయోట్ భారీగా నష్టాన్ని చవిచూసింది. దీనికితోడు మయోట్ కు పక్కనే ఉన్న కొమోరోస్, మడగాస్కర్ ద్వీపాలపైనా ఛీడో తుపాను ప్రభావం చూపింది.

 

ఛీడో తుపాను కారణంగా మయోట్ లో పదుల సంఖ్యలో మరణించగా.. వందలాది మంది తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మయోట్, కొమోరోస్, మడగాస్కర్ ద్వీపాలపై తుపాను ప్రభావం ఉండటంతో.. ఈ ప్రాంతాల్లో మృతుల సంఖ్య వెయ్యి వరకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.