Malawi Storm Freddy: మలావీ, మొజాంబిక్ లో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం.. 100 మంది మృతి

ఆగ్నేయ ఆఫ్రికా దేశాలు, మలావీ, మొజాంబిక్ లో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి 100 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదలు, కొండ చెరియలు విరిగిపడడం, చెట్లు కూలడంతో చాలా మందికి గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. మలావీలో నెల రోజుల వ్యవధిలో తుపాను సంభవించడం ఇది రెండోసారి.

Malawi Storm Freddy

Malawi Storm Freddy: ఆగ్నేయ ఆఫ్రికా దేశాలు, మలావీ, మొజాంబిక్ లో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి 100 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదలు, కొండ చెరియలు విరిగిపడడం, చెట్లు కూలడంతో చాలా మందికి గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. మలావీలో నెల రోజుల వ్యవధిలో తుపాను సంభవించడం ఇది రెండోసారి.

ఆ దేశంలోని బ్లాంటైర్ లో దాదాపు 60కి పైగా మృతదేహాలను అధికారులు గుర్తించారు. తీవ్ర గాలులు, ఎడతెరిపిలేని వర్షాల ధాటికి అక్కడి జనజీవనం స్తంభించింది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, పలు భవనాలు కుప్పకూలాయని అక్కడి పోలీసులు తెలిపారు. అత్యవసర సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండి పనిచేస్తున్నాయని చెప్పారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, సెల్ ఫోన్ సిగ్నళ్లు కూడా కట్ అవ్వడంతో జరిగిన ప్రాణ నష్టాన్ని గుర్తించడం అధికారులకు కష్టతరం అవుతోంది. మొజాంబిక్ లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల తీవ్రతను తగ్గించేందుకు అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు.

North Korea: అమెరికా, ద.కొరియా భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టిన వేళ.. ఉ.కొరియా 2 క్షిపణి పరీక్షలు