North Korea: అమెరికా, ద.కొరియా భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టిన వేళ.. ఉ.కొరియా 2 క్షిపణి పరీక్షలు

ఉత్తర కొరియా చర్యలపై అప్రమత్తంగా ఉన్నామని, ఏవైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే ఎదుర్కోవడానికి అమెరికాతో కలిసి సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియా తెలిపింది. ఉత్తర కొరియా తాజా క్షిపణి పరీక్షలపై జపాన్ ప్రధాని కిషిదా కూడా స్పందించారు. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలపై సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు.

North Korea: అమెరికా, ద.కొరియా భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టిన వేళ.. ఉ.కొరియా 2 క్షిపణి పరీక్షలు

North Korea

North Korea: అమెరికా, దక్షిణ కొరియా భారీ స్థాయిలో సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టడంతో ఉత్తర కొరియా మళ్లీ రెండు స్వల్ప శ్రేణి ఖండాంతర క్షిపణి పరీక్షలు చేసింది. ఉత్తర కొరియా తాజాగా చేసిన ఈ క్షిపణి పరీక్షలపై దక్షిణ కొరియా వివరాలు తెలిపింది. నిన్న ఉదయం 7.40 గంటలకు దక్షిణ హ్వాంఘే ప్రావిన్స్ నుంచి ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేసినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ నుంచి ఓ ప్రకటన వచ్చింది.

ఉత్తర కొరియా చర్యలపై అప్రమత్తంగా ఉన్నామని, ఏవైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే ఎదుర్కోవడానికి అమెరికాతో కలిసి సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియా తెలిపింది. ఉత్తర కొరియా తాజా క్షిపణి పరీక్షలపై జపాన్ ప్రధాని కిషిదా కూడా స్పందించారు. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలపై సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. ఈ క్షిపణుల వల్ల తమ దేశంలో ఏదైనా నష్టం జరిగిందా? అన్న విషయంపై కూడా నిర్ధారణకు రాలేదని అన్నారు.

మూడు వారాల క్రితమే ఉత్తర కొరియా హ్వాసాంగ్-15 ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవలే జలాంతర్గామి నుంచి రెండు వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను పరీక్షించింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు చేపడితే దాన్ని యుద్ధ ప్రకటనగా భావిస్తామని ఉత్తర కొరియా పలు సార్లు హెచ్చరించింది.

Exam Center Locator App : ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక యాప్.. ఎగ్జామ్ సెంటర్ కు ఈజీగా వెళ్లొచ్చు!