Solar Storms Back : భూమిపై జీవం మనుగడకు ముప్పు.. సౌర తుఫానులు తిరిగి వచ్చేశాయి..

సౌరమండలంలో తుఫానులు ఇప్పుడు తిరిగి వచ్చేశాయి.. ఈ సౌర తుఫానులతో భూమికి ముప్పు పొంచి ఉందా? భూమిపై జీవుల మనుగడకు ముప్పు వాటిల్లబోతుందా?

Solar Storms Back : భూమిపై జీవం మనుగడకు ముప్పు.. సౌర తుఫానులు తిరిగి వచ్చేశాయి..

Danger Earth Solar Storms Back And Threatening Life On Earth

Updated On : May 24, 2021 / 6:12 PM IST

Solar Storms Back : సౌరమండలంలో తుఫానులు అంతర్గతంగా విధ్వంసాన్ని సృష్టిస్తుంటాయి. అయితే మళ్లీ ఇప్పుడు సౌర తుఫానులు తిరిగి వచ్చేశాయి.. ఈ సౌర తుఫానులతో భూమికి ముప్పు పొంచి ఉందా? భూమిపై జీవుల మనుగడకు ముప్పు వాటిల్లబోతుందా? అంటే కచ్చితంగా అంచనావేయలేమని అంటున్నారు  ఖగోళ సైంటిస్టులు. కానీ, కొన్ని రోజుల క్రితం, మిలియన్ల టన్నుల సూపర్-హీటెడ్ గ్యాస్ సూర్యుని ఉపరితలం నుంచి భారీగా విస్పోటనం చెందింది. దాంతో 90 మిలియన్ మైళ్ల భూమి వైపు దెబ్బతిన్నట్టు సైంటిస్టులు గుర్తించారు.

కరోనల్ మాస్ ఎజెక్షన్ అని పిలిచే విస్ఫోటనం అంతరిక్ష వాతావరణంలో శక్తివంతమైనది కాదంటున్నారు. కానీ, భూమి అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు బలమైన భూ అయస్కాంత తుఫానుగా మారే ముప్పు ఉండొచ్చునని భావిస్తున్నారు. సౌర తుఫానుల విస్పోటనంతో భూమి ఉపరితలంపై భూ అయస్కాంత తరంగాలతో ప్రమాదకరమైన స్థాయిలో రేడియేషన్‌ విడుదలవుతుంది. దాంతో అంతరిక్షంలోని ఉపగ్రహాలను కిలోమీటర్ నుంచి ఢీకొట్టే ప్రమాదం లేకపోలేదు.

గత ఏడాది నుంచి సూర్యుడు ఉపరితలంపై క్రమంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రత స్థాయిలు 2025లో గరిష్ట స్థాయికి చేరుకుంటే అది భూమిపై వినాశనానికి దారితీయొచ్చునని హెచ్చరిస్తున్నారు. 2017లో, సౌర తుఫాను 5 హరికేన్ ఇర్మా కరేబియన్ దిశగా దూసుకెళ్లింది. 2015లో, సౌర తుఫానులు అమెరికా ఈశాన్యంలో గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థలను ఢీకొట్టాయి. సౌర తుఫానులు తగిలినప్పుడు విమానయాన పైలట్లకు కంటిశుక్లం వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. మహిళా సిబ్బందిలో గర్భస్రావ సమస్యలు అధికంగా ఉండే ముప్పు ఉందని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు.

మార్చి 1989 లో, క్యూబెక్ మీద సౌర తుఫాను ప్రావిన్స్ వ్యాప్తంగా తొమ్మిది గంటలు కొనసాగింది. సౌర తుఫానుల ప్రభావాలతో భూగ్రహానికి సంబంధించిన మౌలిక సదుపాయాలకు హాని కలిగించే భాగాలను కాపాడటానికి ఎంత చేయవచ్చనే దానిపై శాస్త్రవేత్తలలో చర్చ జరుగుతోంది. సౌర తుఫానులో పేలుడుతో గ్రహం నుంచి 1 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న ఉపగ్రహాల గ్రూపుకు భూమిని తాకే వరకు 60 నుంచి 90 నిమిషాలు మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు.