America : దారుణం..తన సీక్రెట్ తెలిసిపోయిందని తల్లిని హత్య చేసిన కూతురు.. ఎక్కడంటే?
కాలేజీ యాజమాన్యం తనను తొలగించిన విషయం తల్లికి తెలిసిపోయిందని కూతురు దారుణానికి ఒడిగట్టింది. తల్లిని ఘోరంగా చంపేసింది.

America
America : కాలేజ్ నుంచి తనను తొలగించిన విషయం తల్లికి తెలిసిపోయిందని కూతురు దారుణానికి ఒడిగట్టింది. తల్లిని కత్తితో పొడిచి చంపింది. సాక్ష్యాలను తారుమారు చేయాలని ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయింది.
UP couple : భార్యపై సామూహిక అత్యాచారం…అనంతరం విషం తాగి దంపతుల ఆత్మహత్య
ఓహియోకు చెందిన 23 ఏళ్ల సిడ్నీ పావెల్ అనే యువతి తల్లి బ్రెండా పావెల్ (50)ను 30 సార్లు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. సిడ్నీ పావెల్ తను చదువుకుంటున్న మౌంట్ యూనియన్ యూనివర్శిటీ తొలగించిందని తల్లికి తెలియకూడదనుకుంది. సాక్ష్యాలను తారుమారు చేయాలని ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయింది.
Canada : కెనడాలోమరో సంచలన హత్య .. ఖలిస్థాన్ ఉగ్రవాది సఖ్‌దూల్ సింగ్ హతం
మార్చి 2020 లో సిడ్నీ పావెల్ తల్లి బ్రెండా పావెల్ తలపై ఇనుప స్కిల్లెట్ తో కొట్టిందని.. ఆమె మెడపై 30 సార్లు పొడిచిందని సమ్మిట్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆమె దోషిగా నిర్ధారించిన తర్వాత సమ్మిట్ కౌంటీ కామన్ ప్లీస్ కోర్ట్ రూమ్‌లో సిడ్నీ ఏడ్చినట్లు తెలుస్తోంది. మార్చి 3, 2020 న బ్రెండా తన ఇంట్లో తీవ్ర గాయాలతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మరణించింది. సిడ్నీ పావెల్ స్కిజోఫ్రెనియాతో బాధపడుతోందని డిఫెన్స్ వాదించింది. అయితే ఆమె నేరం చేసిన సమయంలో రోగ నిర్ధారణ చేయలేమని ప్రాసిక్యూటర్లు నియమించిన సైకియాట్రిస్ట్ సిల్వియా ఓబ్రాడోవిచ్ అన్నారు. సిడ్నీ పావెల్‌కు సెప్టెంబర్ 28 న శిక్ష ఖరారు కానుంది.