Earthquakes 7800 Died : టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు.. 7800 దాటిన మృతుల సంఖ్య

టర్కీ, సిరియాలో భూప్రకంపనలు ఆగడం లేదు. రెండు దేశాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 7,800 దాటింది.

Earthquakes 7800 Died : ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా అతలాకుతలమవుతున్నాయి. రెండు దేశాల్లో అంతులేని విషాదం నెలకొంది. టర్కీ, సిరియాలో భూప్రకంపనలు ఆగడం లేదు. రెండు దేశాల్లో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. వేలాది భనాలు కుప్పకూలాయి. టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 7,800 దాటింది. శిథిలాల తొలగింపులో భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. టర్కీ, సిరియాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రాణ నష్టం 20 వేలకు పైగా ఉండొచ్చని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది.

భూకంపం ధాటికి ఏ శిథిలాన్ని కదిలించినా డెడ్ బాడీలే. పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన భూకంపంతో ఇరు దేశాలు మరణ మృదంగం మోగుతోంది. భూకంపం తీవ్రతకు వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక నగరాలు మరుభూమిని తలపిస్తున్నాయి. భూకంపం దాటికి ఇప్పటివరకు రెండు దేశాల్లో 7,800లకు పైగా మంది మృత్యువాత పడగా, వేలాదిగా ప్రజలు గాయపడ్డారు.

Frank Hoogerbeets : టర్కీ, సిరియాలో భారీ భూకంపాన్ని ముందే ఊహించిన ఫ్రాంక్.. 3రోజుల క్రితమే ట్వీట్

మరోవైపు టర్కీలో వరుస భూప్రకంపనలతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. టర్కీ, సిరియాలో ఎటు చూసిన కూలి పోయిన బిల్డింగుల్లే దర్శనమిస్తున్నాయి. రెండు దేశాల్లోని ప్రాంతాలు శవాల దిబ్బగా మారింది. మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. శిథిలాలు తొలగించే కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి.
మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని, 10 వేలు దాట వచ్చని యూఎన్ జియోలాజికల్ సర్వే చెబుతోంది.

టర్కీ, సిరియా సరిహద్దుల్లో మొన్న, నిన్న వరుస భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల ధాటికి నగరాల్లోని పలు అపార్ట్ మెంట్లు కుప్పకూలాయి. శిథిలాల కింద వేలాది మంది జనం చిక్కుకుపోయారు. వారిని క్షేమంగా బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగతుున్నాయి. రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. భూకంపాల్లో వేల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. టర్కీలోని పలు నగరాలపై భూకంప ప్రభావం పడింది.

ట్రెండింగ్ వార్తలు