Frank Hoogerbeets : టర్కీ, సిరియాలో భారీ భూకంపాన్ని ముందే ఊహించిన ఫ్రాంక్.. 3రోజుల క్రితమే ట్వీట్

టర్కీ, సిరియాలో 7.5 తీవ్రతతో భూకంపం వస్తుందని నెదర్లాండ్స్ కు చెందిన పరిశోధకుడు ముందే అంచనా వేశాడు. టర్కీ, సిరియాను భారీ భూకంపం తాకబోతోందని, ఈ నెల 3న అంచనా వేశాడు.

Frank Hoogerbeets : టర్కీ, సిరియాలో భారీ భూకంపాన్ని ముందే ఊహించిన ఫ్రాంక్.. 3రోజుల క్రితమే ట్వీట్

Frank Hoogerbeets : టర్కీ, సిరియాను భూకంపం అతలాకుతలం చేస్తుందని అక్కడి నిపుణులే అంచనా వేయలేకపోయారు. కానీ టర్కీ, సిరియాలో 7.5 తీవ్రతతో భూకంపం వస్తుందని నెదర్లాండ్స్ కు చెందిన పరిశోధకుడు ముందే అంచనా వేశాడు. టర్కీ, సిరియాను భారీ భూకంపం తాకబోతోందని, ఈ నెల 3న అంచనా వేశాడు.

సోలార్ సిస్టమ్ జామెంట్రీ సర్వే పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్ బీట్స్ మూడు రోజుల క్రితం రాబోయే ఉపద్రవం గురించి హెచ్చరించాడు. ట్విట్టర్ వేదికగా తన పరిశోధన సారాంశాన్ని కూడా తెలియజేశాడు. ఆయన చెప్పింది ఇవాళ అక్షరాల నిజమైంది. ఆయన అంచనాలో ఒక్క పాయింట్ కూడా తేడా రాలేదు. సోమవారం (ఫిబ్రవరి 6,2023) తెల్లవారుజామున సంభవించిన భూకంపం 1600 మందిని బలిగొంది.

Also Read..Turkey Earthquake: తుర్కియె, సిరియాల్లో 1,300కు చేరిన భూకంప మృతుల సంఖ్య.. సహాయక బృందాల్ని పంపనున్న భారత్

మొదటి భూకంపం అనంతరం మరోసారి భారీ భూకంపం వస్తుందని ఫ్రాంక్ అంచనా వేశారు. ఆయన చెప్పినట్లే రెండోసారి కూడా ఎర్త్ షేక్ అయ్యింది. దక్షిణ, మధ్య టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ చుట్టూ ఉన్న ఈ ప్రాంతంలో త్వరలో 7.5 తీవ్రతతో భూకంపం వస్తుందని ఈ నెల 3న ఫ్రాంక్ హూగర్ బీట్స్ అంచనా వేశాడు.

అయితే ట్విట్టర్ లో కొందరు ఫ్రాంక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చెప్పిన అంశాలకు సంబంధించి వాళ్లు ఫ్రాంక్ ను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కొందరైతే ఎందుకు చెడు కోరుకుంటున్నారు మీరు అని ఫ్రాంక్ పై ధ్వజమెత్తారు కూడా. కానీ, ఆయన రెండు అంచనాలు నిజమయ్యాక ఫ్రాంక్ కు నెటిజన్లు క్షమాపణ చెప్పారు.

Also Read..Earthquake In Turkey: టర్కీ, సిరియాల్లో భూకంపం దాటికి నేల మట్టమైన భవనాలు..

రేపు, ఎల్లుండి ఏమైనా భూకంపాలు వచ్చే సూచనలు ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే, తన అంచనా నిజమయ్యాక ఆవేదన వ్యక్తం చేశాడు ఫ్రాంక్. ఇంతమంది చనిపోవటం బాధించిందన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టర్కీ, సిరియాలో భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. భూకంప ఘటనలో అపారమైన ప్రాణనష్టం జరిగింది. భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మృతుల సంఖ్య వెయ్యి నుంచి 10వేల మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. ఈ ప్రాంతంలో వచ్చిన భూకంపాల చరిత్రను బట్టి యూఎస్ జీఎస్ ఈ అంచనా వేస్తోంది. మృతుల సంఖ్య పెరగడంతో పాటు భారీ నష్టం కలగనున్నట్లు చెప్పింది. ఇప్పటికే పలుసార్లు భూమి కంపించడంతో మృతుల సంఖ్య 2వేల 300కి చేరుకుంది.

టర్కీలో మూడుసార్లు భూమి కంపించగా.. 3వేలకు పైగా భారీ భవనాలు నేలకూలాయి. వాటిలో నివసిస్తున్న వేలాది మంది చనిపోయారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు.

కాగా.. టర్కీ, సిరియాలో భూకంపాన్ని సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వేకు చెందిన పరిశోధకుడు ఫ్రాంక్ హుగర్బీట్స్ 3 రోజుల ముందే అంచనా వేశాడు. దక్షిణ మధ్య టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతంలో త్వరలో లేదా మున్ముందు రిక్టర్ స్కేల్ పై 7.5 తీవ్రతతో భూకంపం సంభవిస్తుందని ఫ్రాంక్ ట్వీట్ చేశారు. అయితే, ఆయనను సూడో సైంటిస్ట్ అని, గతంలో ఆయన అంచనాలను ప్రశ్నిస్తూ పలువురు నెటిజన్లు ట్విట్టర్ లో ప్రశ్నించారు.

వరుస భూకంపాలు టర్కీని వణికించాయి. గంటల వ్యవధిలోనే మూడు సార్లు భూమి కంపించింది. వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

భారీ భూకంపాలు టర్కీ, సిరియాను కుదిపేశాయి. సోమవారం తెల్లవారుజామున అంతా గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వేలమంది శిథిలాల కింద నలిగిపోయి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. పసికందులు కూడా ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం.. మొత్తం మూడు సార్లు భారీగా భూమి కంపించడంతో టర్కీ, సిరియాలో అంతులేని విషాదం అలుముకుంది.