Earthquake In Turkey: టర్కీ, సిరియాల్లో భూకంపం దాటికి నేల మట్టమైన భవనాలు.. 100మందికిపైగా మృతి..

భూకంపం తీవ్రతకు టర్కీ, సిరియాలో పెనునష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. భారీ భూకంపం తర్వాత ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల్లో భూకంపం దాటికి 100మందికిపైగా మరణించారు. నేలకూలిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Earthquake In Turkey: టర్కీ, సిరియాల్లో భూకంపం దాటికి నేల మట్టమైన భవనాలు.. 100మందికిపైగా మృతి..

Earthquake In Turkey

Earthquake In Turkey: టర్కీ, సిరియా దేశాల్లోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారు జామున 4.17గంటల సమయంలో భారీ తీవ్రతతో భూమి కంపించింది. దక్షిణ టర్కీలోని నుర్దగీకి 23కిలో మీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.8గా నమోదైంది. భూకంపం తీవ్రతకు రెండు దేశాల్లో వందల సంఖ్యలో అపార్ట్ మెంట్లు, భవనాలు నేలకూలాయి. ఇరు ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. భవన శిథిలా కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరంచేశారు.

 

భూకంపం తీవ్రతకు టర్కీ, సిరియాలో పెనునష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. భారీ భూకంపం తర్వాత ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. టర్కీలో సంభవించిన భూకంపం దాటికి అనేక భవనాలు నేలకూలాయి. టర్కీలోని ఉస్మానియాలో 34 భవనాలు ధ్వంసమయ్యాయి. టర్కీకి ప్రధాన పారిశ్రామిక కేంద్రమైన గజియాన్టెస్, సిరియా సరిహద్దు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. సిరియాలోని పశ్చిమ తీర ప్రాంతమైన లటకియాలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం దాటికి టర్కీలోని ప్రాంతాల్లో 55 మందికిపైగా మరణించగా, సిరియాలోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భవనాలు కూలి 45 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఇరు దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భవనాల శిథిలా కింద అనేకమంది చిక్కుకొని పోయారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు.

 

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని టర్కీ అధ్యక్షుడు రజబ్ తయ్యబ్ ఎర్దుగాన్ ట్వీట్ చేశారు. ఆరు సార్లు భూమి కంపించిందని, దెబ్బతిన్న భవనాల్లోకి ఎవరూ ప్రవేశించవద్దని టర్కీ అధ్యక్షుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉంటే సిరియాలోని అలెప్పో, హమా నగరాల నుండి నష్టం జరిగినట్లు నివేదికలు ఉన్నాయి. సిరియాలో టర్కీ సరిహద్దు ప్రాంతాల్లో చాలా భవనాలు కూలిపోయాయి. సిరియాలోని లెబనాన్ లోనూ 40 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగుపెట్టారు.