shortest teenager: ప్రపంచంలో అత్యంత పొట్టి యువకుడు ఏ దేశస్తుడో తెలుసా? ఎలా ఎంపికయ్యాడంటే..

ప్రపంచంలో పొట్టి వాళ్లు అనేక మంది ఉన్నారు. వారిలో అత్యంత పొట్టివాడు ఏ దేశంలో ఉన్నాడో తెలుసా..? తాజాగా అతడికి ప్రపంచంలో అత్యంత పొట్టివ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సైతం లభించింది. నేపాల్‌లోని ఖాట్మండుకు చెందిన 17 ఏళ్ల యువకుడు డోర్ బహదూర్ ప్రపంచంలోనే అత్యంత పొట్టి టీనేజర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్స్ కు ఎంపికయ్యాడు.

shortest teenager: ప్రపంచంలో పొట్టి వాళ్లు అనేక మంది ఉన్నారు. వారిలో అత్యంత పొట్టివాడు ఏ దేశంలో ఉన్నాడో తెలుసా..? తాజాగా అతడికి ప్రపంచంలో అత్యంత పొట్టివ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సైతం లభించింది. నేపాల్‌లోని ఖాట్మండుకు చెందిన 17 ఏళ్ల యువకుడు డోర్ బహదూర్ ఖ‌పంగి ప్రపంచంలోనే అత్యంత పొట్టి టీనేజర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్స్ కు ఎంపికయ్యాడు. డోర్ బహదూర్ ఖపాంగి 14 నవంబర్ 2004న జన్మించాడు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సభ్యులు అతని కొలతను ఈ ఏడాది మార్చి 23న ఖాట్మండులో తీసుకున్నారు. ఎత్తు 73.43 సెం.మీ (2 అడుగుల 4.9 అంగుళాలు) ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా డోర్ బహదూర్ సోదరుడు నారా బహదూర్ ఖపాంగి మాట్లాడుతూ.. మా సోదరుడికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ రావడం సంతోషంగా ఉందని అన్నాడు.

గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ఖాట్మండులో జరిగిన ఒక వేడుకలో ఖపాంగికి నేపాల్ టూరిజం బోర్డు సీఈవో ధనంజయ్ రెగ్మీ ఒక సర్టిఫికేట్‌ను అందించారు. యువకుడు తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో ఖాట్మండుకు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధులి జిల్లాలో నివసిస్తున్నాడు. అతను రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. అదే గ్రామంలోని పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ఖపాంగి గుర్తింపు అతని పాఠశాల విద్యకు సహాయపడుతుందని అతని సోదరుడు పేర్కొన్నాడు. డోర్ బహదూర్ పుట్టినప్పుడు అంతా బాగానే ఉన్నాడు. అయితే అతను ఏడేళ్ల వయస్సు నుండి ఎదగలేదు. అతని సహచరులు పెరిగారు కానీ డోర్ బహదూర్ అలా పెరగలేదు.  ఇంతకుముందు రికార్డు 67 సెంటీ మీటర్లు ఎత్తు ఉండే ఖగేంద్ర థాపా మగర్ పేరిట ఉండేది. అయితే ఈయన 2020 సంవత్సరంలో 32 ఏళ్ల వయసులో మరణించారు. ప్రపంచంలోనే పొట్టి మహిళ రికార్డు భారత్ కి చెందిన జ్యోతి ఆమ్గే పేరిట ఉంది. ఈమె ఎత్తు 62 సెంటీమీటర్లు.

ట్రెండింగ్ వార్తలు