Batteries In Woman Stomach
Batteries In Woman Stomach: ఐర్లాండ్ లో వైద్యులకు అరుదైన ఘటన ఎదురైంది. 66ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 55 బ్యాటరీలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని తీసేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. తొలుత ఆమె శరీరం నుంచి సహజంగానే బ్యాటరీలను బయటకు వచ్చేలా వైద్యులు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కకపోవటంతో ఆపరేషన్ ద్వారా బ్యాటరీలను తొలగించారు. ఈ బ్యాటరీలు ఆమె పొత్తికడుపులో ఉండటంవల్ల ఆమె జీర్ణకోశ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపలేదని వైద్యులు తెలిపారు.
Viral Video: ప్రియుడితో స్కూటీపై షికారుకెళ్లిన భార్య.. చేజ్ చేసి చితకబాదిన భర్త.. వీడియో వైరల్
ఐర్లాండ్‌లోని సెయింట్ విన్సెంట్ యూనివర్శిటీ ఆస్పత్రిలో ఓ మహిళ కడుపులో నొప్పితో బాధపడుతూ చేరింది. వైద్యులు ఆమెకు స్కానింగ్ నిర్వహించగా.. పొత్తి కడుపులో 55 బ్యాటరీలు పలు రకాల సైజుల్లో ఉన్నట్లు గుర్తించారు. వీటిని సహజంగానే బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నించారు. ఈ విధానం వల్ల వారంలో ఐదు చిన్నసైజు బ్యాటరీలు బయటకు వచ్చాయి. పలు విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ మిగిలిన బ్యాటరీలు పొత్తికడుపులోనే ఉండిపోయాయి.
Viral Video: దీని దుంపతెగ..! పార్టీలోకి దూసుకొచ్చిన సింహం.. యువకుడు చెట్టెక్కినా వదల్లేదు..
మిగిలిన బ్యాటరీలను మహిళ పొట్ట భాగంలో ఒక చిన్న రంధ్రంచేసి వైద్యులు బయటకు తీశారు. ఇక విచిత్రమేమింటే ఆ మహిళ ఆ బ్యాటరీలను కావాలనే మింగిందట. అయితే అన్ని బ్యాటరీలు ఆమె కడుపులో ఉన్నప్పటికీ జీర్ణకోశ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకపోవటం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.