intelligent dog : ఆ శునకం మహా ముదురు .. చదివింది చేసి చూపిస్తున్న డాగ్ వీడియో వైరల్

జంతువులు చదవగలవా? వాటికి అన్ని తెలివితేటలు ఉంటాయా? ఉంటాయి.. కావాలంటే తన టీచర్ చెప్పింది చేసి చూపిస్తున్న ఓ శునకం స్టోరి చదవండి.

intelligent dog

intelligent dog :  కుక్కలు (dog) చదవగలవా? చదివినది అర్ధం చేసుకుని చేసి చూపించగలవా? చూపించగలవు. ఆశ్చరమనిపించినా ఇది నిజమే. ఓ శునకపు యజమాని తన పెంపుడు కుక్కకి ఏది రాసి చూపిస్తే అది చేసి చూపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Malegaon Court: వింతైన తీర్పు ఇచ్చిన మాలేగావ్ కోర్టు.. ముద్దాయి రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలట

పెంపుడు జంతువులకు వాటి యజమానులు రకరకాల విన్యాసాలు నేర్పిస్తుంటారు. వాటికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా అర్ధం చేసుకుని వాళ్లు చెప్పినట్లు చేసి అబ్బురపరుస్తుంటాయి. రీసెంట్ గా ఓ శునకం తన యజమాని (dog parents) కార్డ్ మీద రాసి చూపించినది చేసి చూపిస్తోంది. అంటే అది నిజంగానే కార్డ్ పై రాసింది చదవగలుగుతోందా? ఓ మహిళ తన పెంపుడు శునకానికి కొన్ని కార్డులు చూపించి ఆ కార్డులో రాసి ఉన్నట్లుగా చేయమని చెప్పింది. ఆ కార్డ్ లో రాసి ఉన్నట్లుగానే ఆ డాగ్ విన్యాసం (tricks) చేయడం మొదలుపెట్టింది. ఇక ఇది చూసినవారంతా నోరెళ్లబెట్టారు. ఆ డాగ్ ఆ కార్డ్ మీద ఉన్నది ఎలా చదవగలుగుతోంది? అని అందరికి డౌట్ వచ్చింది. ఇక ఆ లేడీ త్వరలోనే తన డాగ్ కి పుస్తకాలు చదవడం కూడా నేర్పించేస్తాను అంటోంది. అయితే నిజంగానే ఆ శునకం చదవగలుగుతోందా ? లేదా అనే దానికి ఆ లేడీ సమాధానం ఇచ్చింది. ఎవరినీ మోసం చేయడానికి తను ప్రయత్నం చేయడం లేదని కేవలం కొన్ని ట్రిక్స్ నేర్పించడం ద్వారా అది కార్డులో ఉన్నది గుర్తించగులుగతోందని చెప్పుకొచ్చింది.

Kochi police: వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయించారు .. మద్యం మత్తులో బస్సులు నడిపిన డ్రైవర్లకు పోలీసులు వింత శిక్ష..

ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ శిక్షణ ఎలా ఇచ్చారో అర్ధమైందని కొందరు. మీరు మంచి టీచర్ అని కొందరు.. డాగ్స్ నిజంగానే తెలివైనవి అని కొందరు కామెంట్లు పెట్టారు. ఏది ఏమైనా మూగజీవాలు అర్ధం చేసుకుని ఆచరించేలా పాఠాలు చెప్పడం అంటే మామూలు విషయం కాదు. గ్రేట్ టీచర్ కదా ..