Harsh Goenka
Harsh Goenka : సముద్ర జీవుల్లో డాల్ఫిన్లు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఇవి వేగంగా డైవింగ్ చేయగలవు. సముద్రంలో ఉండే..వీటిని చూడటానికి చాలా మంది ముచ్చటపడుతుంటారు. అయితే..ఓ టూర్ బోటుతో పోటీ పడుతున్న డాల్ఫిన్లకు సంబంధించిన వీడియో నెట్టింట ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టూరు బోటుతో డాల్ఫిన్లు వేగంగా డైవింగ్ చేయడం అందర్నీ ఆకట్టుకొంటోంది. ప్రస్తుతం ఆయన షేర్ చేసిన ఈ వీడియోను 84.6 వేల మంది నెటిజన్లు వీక్షించగా..న్యూ పోర్ట్ వేల్స్ షేర్ చేసిన వీడియోను 95 మిలియన్ల నెటిజన్లు చూడడం విశేషం. కేవలం 46 సెక్లన వీడియో ఉంది. కాలిఫోర్నియాిలోని న్యూపోర్టు బీచ్ తీరంలో టూరు బోటుతో పాటు సముద్రంలో 400 డాల్ఫినులు డైవ్ చేస్తూ..పోటీ పడ్డాయి.
డాల్ఫిన్ల వేగం చూసి బోటులో ఉన్న ఆశ్చర్యపోయారు. వాటిని అలా చూస్తూ ఉండిపోయారు. కొంతమంది తమ తమ సెల్ ఫోన్లలో బంధించారు. నిజంగా ఇది చూడడం ఓ అదృష్టం అంటూ..కామెట్స్ చేస్తున్నారు. సముద్రంలో డాల్ఫిన్ల పోటీ..గెలుపు ఎవరిదో అంటూ మరికొంతమంది సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
This is a race I would have loved to participate in…pic.twitter.com/5aPtTj4Bsp
— Harsh Goenka (@hvgoenka) June 25, 2021