Donald Trump: డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా ఏ దేశం ఉత్పత్తులపై ఎంతశాతం సుంకాలు విధించారంటే.. పూర్తి వివరాలు ఇలా..

భారత్, చైనా, పాకిస్థాన్, శ్రీలంక సహా ప్రపంచంలోని పలు దేశాల ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Donald Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పినట్లుగానే ప్రపంచ దేశాలకు షాకిచ్చాడు. కొద్దిరోజులుగా పలు దేశాలపై టారిఫ్ వార్ ప్రకటించిన ట్రంప్.. తాజాగా.. విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశం ఉత్పత్తులపై 26శాతం టారిఫ్ వసూళ్లు చేస్తామని ప్రకటించిన ట్రంప్.. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే ఆటో మొబైల్స్ పై 25శాతం సుంకం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Also Read: Donald Trump: ట్రంప్ టారిఫ్ వార్.. పలు దేశాలపై ప్రతీకార సుంకాల మోత.. భారత్ ఉత్పత్తులపైసహా పాకిస్థాన్, చైనా, శ్రీలంక దేశాలపై..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోకి ప్రవేశించే అన్ని వస్తువులపై కొత్త దిగుమతి సుంకాలను ప్రకటించారు. అయితే, ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ వాణిజ్య క్రమంలో జరిగిన అతిపెద్ద నిర్ణయంగా నిపుణులు పేర్కొంటున్నారు. ట్రంప్ దెబ్బకి ఆసియా మార్కెట్లు చుక్కలు చూస్తున్నాయి. జపాన్ లీడింగ్ స్టాక్ ఇండెక్స్ నిక్కీ 3.5శాతం అంటే భారీగా దాదాపు 1135 పాయింట్లు పడిపోయింది. మరోవైపు యూఎస్ సొంత మార్కెట్ కూడా బాగానే ప్రభావితమవుతోంది. భారతదేశంలోని స్టాక్ మార్కెట్లపైనా ఈ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. ఇదిలాఉంటే.. భారత్, చైనా, పాకిస్థాన్, శ్రీలంక, కంబోడియా సహా ప్రపంచంలోని పలు దేశాల ఉత్పత్తులపై ట్రంప్ విధించిన సుంకాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Japan Earthquake : జపాన్‌లో భారీ భూకంపం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ప్రభుత్వం

అమెరికా ప్రతీకార సుంకాలు ఇలా..
భారత్‌: 26 శాతం
చైనా: 34 శాతం
ఐరోపా యూనియర్: 20 శాతం
తైవాన్‌: 32 శాతం
జపాన్‌: 24 శాతం
దక్షిణ కొరియా: 25 శాతం
థాయిలాండ్‌: 36 శాతం
స్విట్జర్లాండ్‌: 31 శాతం
ఇండోనేషియా: 32 శాతం
మలేషియా: 24 శాతం
కాంబోడియా: 49 శాతం
యూకే: 10 శాతం
దక్షిణాఫ్రికా: 30 శాతం
బ్రెజిల్‌: 10 శాతం
బంగ్లాదేశ్‌ 37 శాతం
సింగపూర్‌: 10 శాతం
ఇజ్రాయెల్: 17 శాతం
ఫిలిఫ్ఫీన్స్‌: 17 శాతం
చిలీ: 10 శాతం
ఆస్ట్రేలియా: 10 శాతం
పాకిస్థాన్‌: 29 శాతం
టర్కీ: 10 శాతం
శ్రీలంక: 44 శాతం
కొలంబియా: 10 శాతం