Donald Trump: ట్రంప్ టారిఫ్ వార్.. పలు దేశాలపై ప్రతీకార సుంకాల మోత.. భారత్ ఉత్పత్తులపైసహా పాకిస్థాన్, చైనా, శ్రీలంక దేశాలపై..

ట్రంప్ మాట్లాడుతూ.. ఈరోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా ఇండస్ట్రీ ఈరోజు పునర్జన్మించినట్లు అయిందని అన్నారు.

Donald Trump: ట్రంప్ టారిఫ్ వార్.. పలు దేశాలపై ప్రతీకార సుంకాల మోత.. భారత్ ఉత్పత్తులపైసహా పాకిస్థాన్, చైనా, శ్రీలంక దేశాలపై..

Donald Trump

Updated On : April 3, 2025 / 7:43 AM IST

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే చేసి చూపించాడు. ప్రపంచంలోని పలు దేశాల నుంచి అమెరికాకు ఉత్పత్తి అయ్యే వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించారు. వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఏ దేశాల ఉత్పత్తులపై ఎంత శాతం సుంకాలు విధిస్తున్నామనే విషయాలను ట్రంప్ వెల్లడించారు.

Also Read: Japan Earthquake : జపాన్‌లో భారీ భూకంపం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ప్రభుత్వం

ట్రంప్ మాట్లాడుతూ.. ఈరోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా ఇండస్ట్రీ ఈరోజు పునర్జన్మించినట్లు అయిందని అన్నారు. యూఎస్ మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా ఈరోజు గుర్తుండబోతుందని ట్రంప్ పేర్కొన్నారు. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్దెత్తున ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తాం. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువుల లభిస్తాయి.. ఫలితంగా అమెరికా స్వర్ణయుగమవుతుందని ట్రంప్ అన్నారు.

 


ట్రంప్ భారత్ గురించి ప్రస్తావిస్తూ.. భారతదేశంపై తాము 26శాతం సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. తనకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి గొప్ప స్నేహం ఉంది. అయితే, భారత్ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా ఉత్పత్తులపై 52శాతం సుంకాలు విధిస్తోందని, అందుకే భారత్ దేశంపైనా ప్రతీకార సుంకాలు విధిచక తప్పలేదని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు భారత్ పోరుగు దేశాలైన చైనాపై 34శాతం, పాకిస్థాన్ 29శాతం, శ్రీలంక 44శాతం, బంగ్లాదేశ్ 37శాతం ప్రతీకార సుంకాలను ట్రంప్ విధించారు. యూఎస్ కు దిగుమతి అయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

 

 

అమెరికా ప్రతీకార సుంకాలు ఇలా..
భారత్‌: 26 శాతం
చైనా: 34 శాతం
ఐరోపా యూనియర్: 20 శాతం
తైవాన్‌: 32 శాతం
జపాన్‌: 24 శాతం
దక్షిణ కొరియా: 25 శాతం
థాయిలాండ్‌: 36 శాతం
స్విట్జర్లాండ్‌: 31 శాతం
ఇండోనేషియా: 32 శాతం
మలేషియా: 24 శాతం
కాంబోడియా: 49 శాతం
యూకే: 10 శాతం
దక్షిణాఫ్రికా: 30 శాతం
బ్రెజిల్‌: 10 శాతం
బంగ్లాదేశ్‌ 37 శాతం
సింగపూర్‌: 10 శాతం
ఇజ్రాయెల్: 17 శాతం
ఫిలిఫ్ఫీన్స్‌: 17 శాతం
చిలీ: 10 శాతం
ఆస్ట్రేలియా: 10 శాతం
పాకిస్థాన్‌: 29 శాతం
టర్కీ: 10 శాతం
శ్రీలంక: 44 శాతం
కొలంబియా: 10 శాతం