Donald Trump: జస్టిన్ ట్రూడో రాజీనామాపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. 51వ రాష్ట్రంగా కెనడా అంటూ కీలక వ్యాఖ్యలు

ట్రూడో రాజీనామాపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Donald Trump reacts to Justin Trudeau resignation as Canada PM

Justin Trudeau Resignation: సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతికితోడు.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి, లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ప్రధానిగా నూతన వ్యక్తి బాధ్యతలు చేపట్టే వరకు ప్రధాని పదవిలో కొనసాగుతానని, ఆ తరువాత పక్కకు తప్పుకుంటానని ట్రూడో స్పష్టం చేశారు. ట్రూడో రాజీనామాపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్టు చేశారు.

Also Read: Justin Trudeau : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా..!

కెనడాలోని మెజార్టీ ప్రజలు అమెరికాలో 51వ రాష్ట్రంగా భాగస్వాములు అయ్యేందుకు ఇష్టపడుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో కలిస్తే కెనడియన్లకు ప్రయోజనం చేకూరుతుంది. కెనడాకు అధికంగా సబ్సిడీలు ఇచ్చి అమెరికా ఎక్కువ కాలం నష్టపోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ విషయం జస్టిన్ ట్రూడోకు తెలుసు కాబట్టే ఆయన రాజీనామా చేశారు. కెనడా అమెరికాలో భాగమైతే ఎలాంటి సుంకాలు, పన్నులు ఉండవు. పైగా రష్యా, చైనా ఓడల నుంచి రక్షణ ఉంటుంది. అంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ పేర్కొన్నారు.

Also Read: Canada: జస్టిన్ ట్రూడో రాజీనామా.. కెనడా నూతన ప్రధాని ఎవరు..? ఆ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికి దక్కబోతుంది..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తరువాత.. కెనడా, మెక్సికోలపై 25శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించాడు. దీంతో జస్టిన్ ట్రూడో అమెరికాకు వెళ్లి.. మార్ -ఏ-లాగో రిసార్టులో డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. కెనడా నుంచి అమెరికాలోకి వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణా అంశాలపై వీరిద్దరూ చర్చించారు. ఈ క్రమంలో వాటిని కట్టడి చేయలేని పక్షంలో కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాల్సి ఉంటుందని ట్రూడోకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. అయితే, వీరి సమావేశం తరువాత ట్రంప్ మాట్లాడుతూ.. కెనడా నుంచి అమెరికాలోకి వలసలు ఆగకపోతే.. అమెరికాకు 51వ రాష్ట్రంగా కెనడా చేరుతుందని పేర్కొన్నాడు. ట్రూడో రాజీనామాతో ప్రస్తుతం ట్రంప్ అదే విషయాన్ని ప్రస్తావించారు. కెనడాలో మెజార్టీ ప్రజలు అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని అనుకుంటున్నారని, అలా జరిగితే అమెరికాకు, వారికి ఎంతో మేలు జరుగుతుందని ట్రంప్ పేర్కొన్నాడు.

Also Read: HMPV News: హెచ్‌ఎంపీవీ వల్ల ఎవరెవరికి ముప్పు ఉంటుంది? చిన్నారులకు సోకితే ప్రమాదమా?

జస్టిన్ ట్రూడో పాలనపై కెనడియన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు సొంత పార్టీ ఎంపీలు ట్రూడో రాజీనామా చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ట్రూడోను ప్రధానిగా కొనసాగిస్తే మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని లిబరల్ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. దీంతో ట్రూడో రాజీనామా చేయాలన్న డిమాండ్ తీవ్రమైంది. ఈ క్రమంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అదేసమయంలో లిబరల్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు.