అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్రమ వలసదారులపై చర్యలు ప్రారంభించి, వందలాది మందిని అరెస్టు చేసి, వారి దేశాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే.
అయితే, బ్రిటన్ రాజు చార్లెస్ చిన్న కొడుకు ప్రిన్స్ హ్యారీని మాత్రం ఆయన ఈ విషయంలో వదిలేస్తున్నారు. ప్రిన్స్ హ్యారీ ఇమ్మిగ్రేషన్‌లో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ అమెరికా నుంచి బహిష్కరించే విషయంలో ట్రంప్ వెనక్కు తగ్గారు.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రిన్స్ హ్యారీని పంపే విషయంలో తాను జోక్యం చేసుకోనని తెలిపారు. ఆయనను వదిలేస్తానని ట్రంప్ చెప్పారు. ఇప్పటికే ప్రిన్స్ హ్యారీస్ భార్యా బాధితుడని ట్రంప్ భావిస్తున్నట్లు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది.
Also Read: నువ్వే హీరోయిన్ అనగానే ఎగేసుకుని రూ.4కోట్లు ఇచ్చేసిన మాజీ సీఎం కూతురు.. కట్ చేస్తే..
మెఘాన్ మార్కిల్‌తో ప్రిన్స్ హ్యారీకి ఎన్నో గొడవలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. అది చాలదు అన్నట్లు మళ్లీ ఇప్పుడు ప్రిన్స్ హ్యారీని పంపించి, ఆయనకు కొత్త సమస్యలను సృష్టించబోమని అన్నారు. కాగా, ట్రంప్‌పై మొదటి నుంచి హ్యారీకి, మెఘాన్ మార్క్లేకు మంచి అభిప్రాయం లేదు. ట్రంప్‌ను బహిరంగంగానూ వారు విమర్శించారు.
వారిపై ట్రంప్ కూడా గతంలో మండిపడ్డారు. కాగా, అమెరికాలో విసా విషయంలో ప్రిన్స్ హ్యారీకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. డ్యూక్ సస్సెక్స్ ఇమ్మిగ్రేషన్‌లో పలు సాంకేతిక లోపాలు ఉన్నాయి. అమెరికా గతంలో వీసా ఇచ్చేందుకు వెనకడుగు వేసింది. డ్రగ్స్ వాడిన విషయాన్ని దాచి పెట్టారని తెలిపింది.
వీసా కోసం దరఖాస్తు చేసే క్రమంలో డ్రగ్స్ వినియోగంపై ప్రిన్స్ హ్యారీ వివరాలు తెలపలేదని అప్పట్లో హెరిటేజ్ ఫౌండేషన్ చీఫ్ నైల్ గార్డెనర్ అన్నారు. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు గతంలోనే రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. అమెరికాలో వారిద్దరు వేర్వేరుగా జీవిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పలు విందులకు ప్రిన్స్ హ్యారీ తన భార్య మేఘన్‌ను తీసుకెళ్లడం లేదు.