Rs.14 Lakh Girl Discovering Rare Chip
doritos company pays rs.14 lakh girl rare chip : సరదాగా చేసే పనులు ఒక్కోసారి చిక్కుల్లో పడేస్తే..ఒక బాలిక సరదాగాచేసిన పని మాత్రం ఆమెను లక్షల రూపాయలకు అధికారిని చేసింది. ఆలూ చిప్స్ అంటూ ఇష్టపడనివారుండరు. అలా ఆలూ చిప్స్ తెచ్చుకుని తింటున్న ఓ చిన్నారికి ఆ ఆలూ చిప్పే కాసుల వర్షం కురిపిస్తుందని అస్సలు అనుకోలేదు. తినగా మిగిలిని ఒకే ఒక్క బంగాళాదుంప ముక్క ఏకంగా రూ.14 లక్షలు సంపాదించిపెట్టిన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. తినగా మిగిలిన ఓ ఆలూ చిప్ ని సరదాగా వేలం వేయగా దాన్ని ఓకంపెనీ ఏకంగా రూ.14 లక్షలు పోసి కొనటంతో ఆ బాలికకు లక్షల రూపాయాలు వచ్చి పడ్డాయి.
ఈ వింత అదృష్టఘటన వివరాల్లోకి వెళితే..ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌కి చెందిన రైలీ స్టువార్ట్ అనే 13 ఏళ్ల బాలికకు ఆలూ చిప్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ప్రముఖ బ్రాండ్ డోరిటోస్ ఆలూ చిప్స్ అంటే ఇంకా ఇంకా ఇష్టం. రోజుకు ఒక్కసారి అయినా ఆలూ చిప్స్ తినాల్సిందే. అంత ఇష్టం అవంటే రైలీకి.
అలా ఓరోజున రైలీ డోరిటోస్ చిప్స్ ప్యాకెట్ కొనుక్కుని ఇంటికి తీసుకొచ్చింది. అలా తింటూ తింటూ మొత్తం ఖాళీ చేసింది ఒకే ఒక్క ఆలూ చిప్ ను తప్పించి. మొత్తం ప్యాకెట్ లో ఓ ముక్క రైలీకి డిఫరెంట్ షేపులో కనిపించింది.అందుకే దాన్ని తినకుండా పక్కపెట్టింది. డోరిటోస్ ఆలూ చిప్స్ ట్రయాంగిల్ (త్రికోణం ఆకారం) లోనే ఉంటాయి. చిప్స్ లో చిన్న చిన్న బబుల్స్ లాగా ఉంటాయి. రైలీ తెచ్చుకున్న డోరిటోస్ చిప్స్ ప్యాకెట్ లో ఉన్న డిఫెరెంట్ షేప్ చిప్ మిగతా చిప్స్ ముక్కల్లా కాకుండా…సమోసాలాగా ఉబ్బినట్లుగా ఉంది. దానికి బబుల్స్ కూడా లేవు. అచ్చు సమోసాలాగా ఉంది.
అది రైలీకి వెరైటీగా అనిపించింది. దీంతో రైలీ ఆ చిప్ ను దాచుకోవాలని అనుకుంది ఏదో సరదాగా. ఆ చిప్ ముక్కను వీడియో తీసింది. టిక్‌టాక్‌లో ఉబ్బిన స్నాక్ అని పేరు పెట్టి అప్‌లోడ్ చేసింది. ఏమీ ఎక్స్ పెక్ట్ చేయకుండా అదేదో సరదాగా చేసిన పని. కానీ అదే ఆమెకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.
సమోసాలా ఉన్న ఆ ఆలూ చిప్ వీడియో తెగ వైరల్ అయిపోయింది. ఏది ఎలా ఎప్పుడు వైరల్ అవుతుందో చెప్పలేం. అలా ఆ ఆలూ చిప్ తెగ వైరల్ అయిపోయింది.ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో కూడా షేర్ అయ్యింది. ఇక టిక్‌టాక్‌లో అయితే చెప్పనే అక్కరలేదు. ఏకంగా మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దీన్ని అమ్ముతారా ఏంటీ అని కొంతమంది కామెంట్స్ పెట్టటంతో ‘‘సరదాగా ఆ పనిచేస్తే పోలా..వేలం వేస్తే పోలా’’ అనుకుంది రైలీ అదే సరదాతో.
అనుకున్నదే తడవుగా రైలీ దాన్ని ఫోటో తీసి ఈబే సైట్‌లో లిస్ట్ చేసింది. చిప్ ఖరీదు ఒక్క డాలర్ కంటే తక్కువ కోట్ చేసింది. కానీ పోలా అద్దిరిపోలా అన్నట్లుగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. లిస్ట్ చేసిన కేవలం గంటల వ్యవధిలోనే ఆ ఆలూ చిప్ విలువ 2 వేల డాలర్లకు చేరింది. దీంతో రైలీ షాక్ అయ్యింది. ఏంటిది?అని తెగ ఆశ్చర్యపోయిందా చిన్నారి.
ఆ చిప్ ముక్కకు సొంతం చేసుకోవటానికి చాలామంది ముందుకొచ్చారు అదికూడా భారీ ధరకు. ఈ వేలం అలా కొనసాగుతూండగా..ఏ కంపెనీ ప్యాకెట్ లో ఆ చిప్ ముక్క వచ్చిందే అదే డోరిటోస్ కంపెనీకి ఈ వేలం విషయం తెలిసింది. అది చూసిన వెంటనే డోరిటోస్ కంపెనీ ఆశ్చర్యపోయింది. సదరు బాలిక వినూత్న ఆలోచనకు ఫిదా అయిపోయింది డోరిటోస్ కంపెనీ. అంతే వెంటనే రంగంలోకి దిగింది. బిడ్డింగ్‌లో పాల్గొంది. ఎవ్వరూ ఊహించని ధరకు దాన్ని కొనేసింది. ఎంతంటే..20,100 డాలర్లకు అంటే మన భారత కరెన్సీలో 14,90,251 రూపాయలు.
ఈ విషయం తెలిసి రిలే కుటుంబం ఆనందానికి అంతులేదు.ఏదో సరదాగా చేస్తే ఇన్ని డబ్బులొచ్చాయేంటీ అంటూ ఆశ్చర్యానందాల్లో మునిగిపోయింది. సంతోషంతో ఉబితబ్బబ్బు అయిపోయింది. ఇక ఏదో సరదాకు చేసిన పనికి ఇంత డబ్బు వస్తుందని అస్సలు ఊహించలేదు అంటూ 13 ఏళ్ల రైలీ సంతోషంతో గంతులేస్తోంది.
అంత ధరకు ఎందుకు కొన్నామంటే
ఒక చిన్న ఆలూ చిప్ ముక్కను రూ.14 లక్షలు పెట్టి ఎందుకు కొన్నదో డోరిటోస్ వివరణ ఇస్తూ..” చిప్స్ ప్యాకెట్ కొన్న మరెవరైనా అయితే..అన్ని చిప్స్ లోకి డిఫరెంట్ గా ఉన్న ఆ ముక్కను కూడా తినేవారేమో..కానీ ఆ బాలిక డిఫరెంట్ గా ఆలోచించింది. క్రియేటివ్‌గా ఆలోచించింది. దాన్ని కూడా వ్యాపార కోణంలో బాలిక ఆలోచించటం బాగా నచ్చింది. తినగా మిగిల్చిన ముక్కతో బిజినెస్ చేసింది. ఆమె వినూత్న ఆలోచన.. ధైర్యం మాకు నచ్చింది. ఆమెలో ఓ వ్యాపారవేత్తను మేం చూశాం. అంతేకాదు ఆమె కుటుంబం అంతా మా కంపెనీ చిప్స్‌కి అభిమానులు. అందుకే ఇలా ఇంత ధరకు కొన్నాం అని వివరించింది.