టైమ్ వేస్ట్ : 5 ఏళ్లుగా స్నానం చేయటం మానేసిన డాక్టర్..

Dr. James Hamblin stopped bathing for 5 years : ప్రతిరోజూ స్నానం చేయడం..అంత అవసరమా? స్నానం చేశాక క్రీములు, పౌడర్లు, బాడీ స్ప్రేయర్లు కొట్టుకోవటం అంత అవసరమా? ఇవన్నీ వాడటం వల్ల ఉపయోగాలేంటీ? అసలు స్నానం చేయకపోతే ఏమవుతుంది? స్నానం చేయకుండా ఉండలేమా? అని ప్రశ్నిస్తున్నారు గత ఐదు ఏళ్లుగా స్నానం చేయటం మానేసిన ఓ డాక్టర్..

నేను ఐదేళ్లనుంచి స్నానం చేయటం మానేసాను. కానీ నాకు ఎటువంటి ఇబ్బందీ అనిపించలేదని అంటున్నారు డాక్టర్ జేమ్స్ హ్యాంబ్లిన్. ‘స్నానం చేయకుండా ఉంటే మీకు కూడా అలవాటైపోతుంది..స్నానం చేయకపోవటం పెద్ద విషయం కాదనేది సాధారణమైనదేనని మీకు కూడా తెలుస్తుంది అని అంటున్నారు 38 ఏళ్ల యంగ్ డాక్టర్ జేమ్స్ హ్యాంబ్లిన్. డాక్టర్ హ్యాంబ్లిన్ యేల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. జేమ్స్ ప్రివెంటివ్ మెడిసిన్ వైద్యుడు కూడా.

స్నానం గురించి డాక్టర్ జేమ్స్ హ్యాంబ్లిన్ మాట్లాడుతూ..‘మన జీవితంలో రెండేళ్ల కాలాన్ని స్నానం చేయడానే సరిపోతుంది.అందులో టైమ్ వేస్ట్, వాటర్ వేస్ట్ అవుతోంది? అనే విషయం మీరెప్పుడన్నా గమనించారా? ఆలోచించారా?అని ప్రశ్నించారు.

డాక్టర్ జేమ్స్ హ్యాంబ్లిన్ రచించిన “క్లీన్: ది న్యూ సైన్స్ ఆఫ్ స్కిన్ అండ్ ది బ్యూటీ ఆఫ్ డూయింగ్ లెస్” అనే పుస్తకంలో స్నానం గురించి తద్వారా అయ్యే వాటర్, టైమ్ వేస్ట్ ల గురించి మరింత వివరంగా రాశారు. స్నానం చేయటం పెద్ద ఉపయోగం కాదని అన్న డాక్టర్ చేతులు శుభ్రపర్చుకోవడం, పళ్ళు తోముకోవడం మాత్రం మానకూడదని చెప్పారు.

ఈ స్నానం మానేయాలనే ఆలోచన ఒక ప్రయోగంలా మొదలయిందట డాక్టర్ కు. స్నానం చేయటం మానేస్తే ఏమవుతుంది? అని తెలుసుకోవాలనే ప్రశ్నతో వచ్చిన ఆలోచనతో స్నానం చేయటం మానేసానని తెలిపారు. ఈ సందర్బంగా జేమ్స్..చాలా తక్కువ సార్లు స్నానం చేసేవారి గురించి నాకు తెలుసు..అలా నేను కూడా ఎందుకు చేయకూడదు? అని అనుకుని స్నానం చేయటం మానేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నానని అలా మొదలైంది స్నానం మానేసిన విధానం..అని తెలిపారు. 2015 నుంచి స్నానం చేయడం ఆపేసారు డాక్టర్ జేమ్స్ హ్యాంబ్లిన్.

కానీ ఏమీ కాలేదు. చికాకు అనిపించలేదు. అలా రోజులు..వారాలు గడుస్తున్న కొద్దీ..నా శరీరం స్నానం చేయకుండా ఉండటానికి అలవాటు పడిపోతుంది. దీంతో సబ్బు వాడకపోయినా నా శరీరం నుంచి ఎటువంటి దుర్వాసనా రాలేదు. అలాగే శరీరం జిడ్డుగానూ కాలేదని డాక్టర్ తెలిపారు.

ఇక తలస్నానం విషయానికి వస్తే డాక్టర్ ఏం అంటున్నారంటే..‘చాలా మంది జుట్టుకు పట్టిన జిడ్డును వదిలించుకోవడానికి రకరకాల షాంపూలూ..కండిషనర్లు వాడతారు. కానీ..అలా చేయం మానేస్తే..కొన్ని రోజులకు వాటిని వాడక ముందు మీ జుట్టు ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా తయారైంది? అనే విషయం మీకు అర్థమవుతుంది? అవి వాకడ ముందు మీ జుట్టు ఎలా ఉండేదో తిరిగి అలానే తయారైపోతుందంటారాయన.

డాక్టర్ స్నానం వేస్ట్ అన్నారని ఒక్కసారిగా సడెన్ గా ఆపేయకుండా..షాంపూ, డియో, సబ్బు వాడకాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ..అలా రెండు,మూడు రోజులకొకసారి స్నానం చేయడం మొదలు పెట్టారు. అలా చాలా సార్లు నాకు స్నానం చేయాలని అనిపించేది. అదొక పెద్ద ప్రక్రియలాగా అనిపించేది. అలాని రెండు మూడు రోజులుస్నానం చేయనంత మాత్రాన నా శరీరం జిడ్డు పట్టి దుర్వాసన వచ్చేది కాదు. అది క్రమేపీ తగ్గిపోయింది. సబ్బు, నీటిని తక్కువగా వాడటం మొదలు పెట్టేసరికి వాటి అవసరం కూడా తగ్గిపోతూ వచ్చింది.

ప్రతి రోజూ జుట్టుకు, చర్మానికి రకరకాల ప్రొడక్టులు వాడటం వలన శరీరం పై ఉండే తైలాలు, బ్యాక్టీరియాల మధ్య ఉండే సమతుల్యత దెబ్బ తింటుందని హ్యాంబ్లిన్ వాదిస్తారు. చాలామంది రోజుకు మూడు నాలుగు సార్లు స్నానం చేస్తుంటారు. అలా విపరీతంగా స్నానం చేయడం వల్ల..చుట్టూ ఉన్న సహజ స్థితిని దెబ్బ తీయడమే” అని ఆయన 2016లో అట్లాంటిక్ పీస్ కి రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. అవి వెంటనే దుర్గంధం పుట్టించే మైక్రోబ్ లకు సహకరిస్తాయి అని ఆయన అన్నారు.

తరచుగా స్నానం చేయడం మానేయడం వలన సహజ స్థితి ఒక స్థిరత్వానికి వచ్చి దుర్గంధం వెలువడటం ఆగిపోతుందని ఆయన అంటారు. స్నానం చేయటం..సౌందర్యసాధానాలు వాడటం మానేస్తే..మీరు రోజ్ వాటర్ లానో, బాడీ స్ప్రేలానో సువాసనలు వెదజల్లకుండా…ఓ మనిషిలా వాసన వస్తారంటారాయన. నిజానికి ఆయన దగ్గర నుంచి వచ్చే కొత్త వాసనను ఆయన భార్య కూడా ఇష్టపడిందని ఆనందంగా చెప్పారు డాక్టర్ జేమ్స్ హ్యాంబ్లిన్.

హ్యాంబ్లిన్ పూర్తిగా స్నానం చేయడం ఆపేయలేదు. అప్పుడప్పుడూ చేస్తారట. శరీరక వ్యాయామం అనేది చాలా అవసరం కాబట్టి ఆయాన చక్కటి వ్యాయామం చేస్తారు. ఆ తరువాత మట్టి పట్టినట్లుగా అనిపిస్తే స్నానం చేస్తారట. కానీ, స్నానం చేయకుండా కూడా మురికిని తొలగించుకోవచ్చంటారాయ. స్నానం చేయడం ఆపేయాలని హ్యాంబ్లిన్ తీసుకున్న నిర్ణయం ప్రయోగం మాత్రమే కాదు.

చర్మం బైట శుభ్రత మీదనే చాలామంది దృష్టి పెడుతున్నారు. కానీ శరీరం అంతర్గత ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని అది చాలా ముఖ్యమని అంటారు. మన శరీరం లోపల జరుగుతున్న ప్రక్రియకు , జీవన శైలికి చర్మం అద్దం పడుతుందంటారు.

కాగా..డాక్టర్ అయిన జేమ్స్ హ్యాంబ్లిన్ 2012 లో మీడియాలో వృత్తిని ఎంచుకున్నారు. ది అట్లాంటిక్‌లో చేరారు. 2011 లో ప్రారంభించిన ది అట్లాంటింక్ ఆరోగ్య ఛానెల్‌కు ఎడిటర్ అయ్యారు. 2019 లో..హాంబ్లిన్ ది అట్లాంటిక్ మేనేజింగ్ ఎడిటర్ సారా ఫ్రీమాన్ యాగెర్‌ను వివాహం చేసుకున్నారు. డాక్టర్ జేమ్స్ హ్యాంబ్లిన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్న వయస్సు డాక్డర్ గా పలు అంశాల్లో  ఆయన ప్రజారోగ్యం, నివారణ వైద్యంలో ప్రత్యేకత కలిగిన బోర్డు సర్టిఫికేట్ పొందిన డాక్టర్.

ట్రెండింగ్ వార్తలు