Dubai Musician: భారత మూలాలున్న మ్యుూజీషియన్‌కి యూఏఇ గోల్డెన్ వీసా

భారత మూలాలు కలిగిన వ్యక్తికి దుబాయ్ లో గోల్డెన్ వీసా లభించింది. దుబాయ్ లో ఉంటున్న నికీముఖీ యూఏఈలో బాగా పాపులర్ మ్యుజిషియన్.. ఈనేపధ్యంలో ఆయనకు యూఏఈ గోల్డెన్ వీసా జారీచేసింది.

Musician Golden Visa

Dubai Musician: భారత మూలాలు కలిగిన వ్యక్తికి దుబాయ్ లో గోల్డెన్ వీసా లభించింది. దుబాయ్ లో ఉంటున్న నికీముఖీ యూఏఈలో బాగా పాపులర్ మ్యుజిషియన్.. ఈనేపధ్యంలో ఆయనకు యూఏఈ గోల్డెన్ వీసా జారీచేసింది. దుబాయ్ లో పుట్టి అక్కడే పెరిగిన ముఖీ భారత సంతతికి చెందిన వ్యక్తి.

నిఖీముఖీకి ఆర్ట్ అండ్ కల్చరల్ విభాగంలో గోల్డెన్ వీసా ను యూఏఈ అందజేసింది. సంగీతకళాకారునిగా 50కుపైగా నగరాలలో అనేక ప్రదర్శనలు ఇవ్వటంతోపాటు అక్కడ పాపులర్ అవ్వటంతో ఆయనను యూఏఈ గుర్తించింది.

ఎంతోకాలంగా అక్కడ నివాసముంటున్న వారికి పెట్టుబడిదారులకు , పారిశ్రామిక వేత్తలకు, వివిధ రంగాల్లో ప్రతిభ కలిగినవారికి, పరిశోధకులకు, మెడికల్ తోపాటు, శాస్త్ర సాంకేతి రంగాల్లో ఉన్న నిపుణులకు గోల్డెన్ వీసా జారీచేస్తారు. ముఖీతోపాటు అతని సోదరు పవన్ కూడా సంగీతరంగంలో కొనసాగుతున్నారు.

చిన్నవయస్సు నుండే సంగీతసాధనలో నిఖీముఖీ మంచి ప్రావీణ్యాన్ని సంపాదించాడు. స్ధానిక తన సోదరులతోపాటు మరికొందరు స్నేహితులతో కలసి సోషల్ మ్యూజిక్ ఫ్లాట్ ఫాం ను ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇస్తున్నాడు. యూఏఇ అందేజేసిన గోల్డెన్ వీసా కాలపరిమితి 10 సంవత్సరాలపాటు ఉండనుంది. అయితే ఆతరువాత దానంతట అదే తిరిగి రెన్యువల్ చేయబడుతుంది. గోల్డెన్ వీసా లభించటం పట్ల ముఖీ ఆనందం వ్యక్తం చేశాడు.