దీపావళి ఫెస్టివల్ : జాతీయ గీతాన్ని వాయించిన దుబాయ్ పోలీస్ బ్యాండ్

  • Publish Date - October 25, 2019 / 07:46 AM IST

దీపావళి పండుగ సందర్భంగా భారతీయ జాతీయ గీతాన్ని దుబాయ్ పోలీసు బ్యాండ్ వాయించారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దుబాయి టూరిజం, దుబాయి‌లోని ఇండియన్ కాన్సులేట్ సహకారంతో హాతీస్ గార్డెన్‌‌లో దీపావళి వేడుకలను నిర్వహించారు. సాంస్క్రతిక కార్యక్రమాలు అలరించాయి. వేడుకల సందర్భంగా బాణాసంచా అలరించింది. లేజర్ వెలుగులు హైలెట్‌గా నిలిచాయి.

Read More : హర్యానాలో కమలమే.. స్వతంత్రుల సపోర్ట్ బీజేపీకే!
లయబద్ధమైన ధ్వనుల మధ్య..బాణాసంచాను కాల్చి..లేజర్ వెలుగులను ప్రదర్శించారు. వేడుకలను చూసేందుకు చాలా మంది భారతీయులు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. ఈ సందర్భంగా దుబాయ్ పోలీస్ బ్యాండ్ భారతీయ జాతీయ గీతాన్ని వాయించారు. దీనికి అనుగుణంగా అక్కడున్న వారు గీతాన్ని ఆలపించారు. గీతం అయిపోయిన అనంతరం..జై హింద్ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.