Earth : షాకింగ్ న్యూస్..త్వరలో భూమి నాశనమౌతుందంట!

అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు సంచలానాత్మక హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శతాబ్ధం చివరి నాటికి భూమిపై అనేక మార్పులు సంభవించే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు.

Earth Headed For Doom : భూమి త్వరలోనే అంతరించిపోతుందని..నాశనం అవుతుందని ఎన్నో పుకార్లు షికారు చేశాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ కనివినీ రోగాలు రావడం, ఎంతో మంది వీటికి బలి అవుతున్నారు. తాజాగా..ప్రపంచ అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు సంచలానాత్మక హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ మ్యాగజైన్ ‘నేచర్’ నిర్వహించిన సర్వేలో భూమికి సంబంధించిన విషయాలు వెల్లడించింది.

Read More : Balmuri Venkat: మా పార్టీలో అభిప్రాయ భేదాలు నిజమే.. కానీ..!

శతాబ్ధం చివరి నాటికి భూమిపై అనేక మార్పులు సంభవించే అవకాశం ఉందని, త్వరలోనే భూమి నాశనమౌతుందని సర్వే నివేదిక వెల్లడించింది. 2100 నాటికి ఎవరూ ఊహించని భయంకరమైన మార్పులు సంభవించి ఘోరమైన మారణ హోమం జరుగబోతుందని సర్వే సారాంశం. 233 మంది ప్రకృతికి సంబంధించిన శాస్త్రవేత్తలు రూపొందించిన ఐపీసీసీ వాతావరణ నివేదికలో పేర్కొంది. ఇందులో కొలంబియాలోని యాంటీకోయా విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చర్ పావోలా అరియాస్ కూడా ఉన్నారు.

Read More : Earthquake in Visakha: వింత శబ్దాలతో విశాఖలో భూ ప్రకంపనలు..!

ప్రస్తుతం ప్రపంచంలో కాలుష్యం అధికమౌతోందని, దీని కారణంగా ప్రజలు జీవించడం కష్టతరమౌతుందని తెలిపారు. వర్షాల గతి మారడంతో నీటి సమస్య వెంటాడితే…భయంకరమైన పరిస్థితులను చవి చూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గ్లోబల్ వార్మింగ్ గురించి నత్తనడకన చర్యలు తీసుకుంటున్నారని, ఇది ఇలాగే కంటిన్యూ అయితే..మాత్రం ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయన్నారు. ఈ కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున మృత్యువాత పడే అవకాశం ఉందని, భూమిని రక్షించుకోవడానికి వెంటనే చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన.

ట్రెండింగ్ వార్తలు